34.1 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home గాసిప్స్ #RRR ఫస్ట్ లుక్! ఎప్పుడో తెలుసా?

#RRR ఫస్ట్ లుక్! ఎప్పుడో తెలుసా?

rrr first look updates ...
- Advertisement -

rrr first look updates ...

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం #RRR . ప్రస్తుతం హైదరాబాద్ రామోజీఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్ జరుగుతోంది. రామ్ చరణ్ పై యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు.

పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ …

మరోవైపు, ఈ సినిమా ఫస్ట్ లుక్స్ విడుదలపై కసరత్తు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న రాజమౌళి తనయుడు కార్తికేయ, షార్ట్ గ్యాప్ తర్వాత తిరిగి మళ్లీ పనిలో పడ్డాడు. ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ లుక్స్ బాధ్యతను ఇతడే తీసుకున్నాడట.

ఇకపోతే, వచ్చేనెలలో రామ్ చరణ్ పుట్టినరోజు ఉంది. దీనితో రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఆర్ఆర్ ఆర్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల కావచ్చని తెలుస్తోంది. ఇక సినిమా టైటిల్, హీరోయిన్స్ తదితర విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఓ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ ఖరారైనట్లు సమాచారం.

ఆలియాభట్ ఈ చిత్రంలో చరణ్ కి జోడీగా నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ కోసం కొత్త హీరోయిన్‌ను తీసుకోనున్నట్టు సమాచారం.

చదవండి : బాలీవుడ్ భామ వైపు చూస్తోన్న జక్కన్న! అలియాభట్‌పై కన్ను?

- Advertisement -