

హైదరాబాద్: వైసీపీ నాయకురాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిళపై సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం విని పోలీసులు విస్తుపోయారు.
వైఎస్ షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, వీడియోలను చూసి.. తాము కూడా అలాంటి వీడియోల చేశామని నిందితులు పెద్దిశెట్టి వెంకటేష్, ఎ నవీన్‌లు చెప్పారు. అయితే, లైకుల కోసమే ఈ వీడియోలను చేశామని నిందితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనడం గమనార్హం.
వైఎస్ షర్మిలపై అశ్లీల ప్రచారం చేశారంటూ గుంటూరు వాసి పెద్దిశెట్టి వెంకటేష్, మంచిర్యాలకు చెందిన ఎ నవీన్‌ను పోలీస్ అధికారులు కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేశారు. వారి నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారించారు.
షర్మిలపై తమకు ఎలాంటి దురుద్దేశం లేదని, తాము రాజకీయ ప్రయోజనాల కోసం వీడియోలు యూట్యూబ్‌లో ఉంచలేదని నిందితులు పోలీసులకు వివరించారు.
ఆ యూట్యూబ్ ఛానళ్లకు తాఖీదులు
తాను కొద్దినెలల క్రితం ఆరు వీడియోలను పోస్ట్ చేసినట్టు వెంకటేష్ చెప్పగా.. రెండురోజుల్లో నాలుగు వీడియోలు అప్‌లోడ్ చేశానని నవీన్ తెలిపాడు. వీరు అప్‌లోడ్ చేసిన ఫోటోలు, వీడియోల్లో ఉన్న సమాచారం ఎలా తీసుకున్నారన్న అంశంపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, షర్మిలపై అశ్లీల ప్రచారం చేసిన మరో రెండు యూట్యూబ్ ఛానెళ్లపై సైబర్ క్రైమ్ అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ఛానెళ్ల ప్రతినిధులకు తాఖీదులు పంపించారు. సంతృప్తికరమైన సమాధానాలు, సాంకేతిక సమాచారంతో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ తాఖీదుల్లో పేర్కొన్నారు.
ఈ రెండు ఛానెళ్లలో షర్మిల వ్యక్తిగత జీవితంపై వందకుపైగా వీడియోలను పోస్ట్ చేయడం గమనార్హం. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
షర్మిల కేసు: విచారణ ముమ్మరం, ఇద్దరు నిందితుల కస్టడీ కోరిన సైబర్ క్రైమ్! సూత్రధారులెవరో తేల్చేస్తారా?
షర్మిల ఫిర్యాదు: పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు? బీటెక్ యువకుడు సహా…
షర్మిల ఫిర్యాదు: దూకుడు పెంచిన పోలీసులు, 12 వెబ్‌సైట్లు గుర్తింపు.. గూగుల్, యూట్యూబ్‌లకు లేఖలు!
వైఎస్ షర్మిలకు విజయశాంతి మద్దతు.. న్యాయం జరిగే వరకూ పోరాడాలంటూ పిలుపు…
ప్రభాస్‌ను ఎన్నడూ కలవలేదు.. మాట్లాడలేదు, అన్నీ పుకార్లే: వైఎస్ షర్మిల, కమిషనర్‌కు ఫిర్యాదు
షర్మిల కేసులో యువకుడి అరెస్ట్! హైదరాబాద్‌కి తరలింపు!








