రాజమౌళి మల్టీస్టారర్‌లో ‘బాహుబలి’!

prabhash act as rajamouli rrr movie
- Advertisement -

prabhash act as rajamouli rrr movie

హైదరాబాద్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ కలయిక‌లో భారీ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాహుబలిలాంటి భారీ విజయం తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం # ఆర్ ఆర్ ఆర్. దీనితో ఈ చిత్రం పై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి.

చదవండి : బాలీవుడ్ భామ వైపు చూస్తోన్న జక్కన్న! ఆలియాభట్‌పై కన్ను?

ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్లు, ప్రతి నాయకుడు తదితర పాత్రలకు సంబంధించి నేటికీ క్లారిటీ లేదు. ఈ చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్‌లో అడుగుపెట్టినప్పటికీ హీరోల మినహా ఇతరత్రా నటీనటులపై చిత్రబృందం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

మరో హీరోని చేర్చిన రాజమౌళి ..

సినిమాకు హైప్ క్రియేట్ చేసుకోవడంలో రాజమౌళికి రాజమౌళియే సాటి అన్న విషయం ‘బాహుబలి’తోనే నిరూపణ అయ్యింది. ప్రస్తుతం ‘RRR’కు కూడా హైప్ క్రియేట్ చేసే పనిలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తుంది. తన సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను కూడా భాగం చేయనున్నారనే వార్త ఒకటి బాగా వినిపిస్తోంది. ఈ మల్టీ స్టారర్ లో ఓ గెస్ట్ రోల్‌లో ప్రభాస్‌ను నటింపజేయాలనే యోచనలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మల్టీ స్టారర్ లో బాహుబలి నటిస్తే , ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రాల్లో ఇదే భారీ మల్టీస్టారర్ అవుతుంది అనడం లో ఎటువంటి సందేహంలేదు.

- Advertisement -