22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీకి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ఇచ్చాం.. చర్చకు సిద్ధమా?: చంద్రబాబుకు అమిత్ షా సవాల్!

ఏపీకి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ఇచ్చాం.. చర్చకు సిద్ధమా?: చంద్రబాబుకు అమిత్ షా సవాల్!

amit-shah fires on ap cm chandrababunaidu
- Advertisement -

amit-shah fires on ap cm chandrababunaidu

విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. సోమవారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీకి 20 జాతీయ సంస్థలను మంజూరు చేశాం. పది లక్షల పక్కా ఇళ్లు ఇచ్చాం. బాబు సహకరించకపోయినా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం.. ” అని చెప్పుకొచ్చారు.

మొత్తమ్మీద ఇప్పటివరకు రూ.5.56 లక్షల కోట్ల పనులు చేశామని, కీలకమైన 14 అంశాల్లోని 10 అంశాలను పూర్తి చేశామని చెప్పిన అమిత్ షా, ఏపీకి న్యాయం ఒక్క నరేంద్ర మోడీతోనే జరుగుతోందన్నారు. అంతేకాదు, దీనిపై చర్చకు చంద్రబాబు సిద్ధమా? అని కూడా షా ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి బాబు ఒప్పుకున్నారని కూడా ఆయన చెప్పారు.

అధికారం కోసమే.. అడ్డుకుంటాం…

ఏపీలో టీడీపీ, వైసీపీ రెండూ అవినీతి పార్టీలేనన్న అమిత్‌ షా, బీజేపీతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. తన కొడుకును సీఎం చేయాలన్నదే బాబు ప్రయత్నమన్న ఆయన… అమరావతి, పోలవరం నిర్మాణాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అంతేకాదు, సీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాబు, ఆయన సీఎంగా ఉన్న 14 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా ఆ ప్రాంతానికి తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు.

‘‘బాబు రాజకీయ జీవితం కాంగ్రెస్‌తో ప్రారంభం అయింది. ఎన్టీఆర్‌ని మోసం చేసి టీడీపీని చేజిక్కించుకున్నారు. తర్వాత ఎన్డీఏతో జత కట్టి వదిలేశారు. మళ్లీ మోడీ ప్రధాన అవుతారని తెలిసి.. అధికారం కోసం ఎన్డీఏతో కలిసి వచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టారు. ఆ ఎన్నికల్లో దెబ్బ తగలడంతో కాంగ్రెస్‌ని వదిలేసి మహా కూటమి పేరుతో జాతీయ పార్టీలను ఏకం చేయడానికి చూస్తున్నారు..’’ అన్నారు.

2019లో మళ్లీ మోడీ ప్రధాని కావడం ఖాయమని, అప్పుడు మళ్లీ చంద్రబాబు ఎన్డీయేలోకి రావడానికి ప్రయత్నిస్తారని, కానీ తాము చంద్రబాబును రానివ్వమని అమిత్ షా స్పష్టం చేశారు.

చదవండి : దీదీకి భయమెందుకో అర్థమైంది: బెంగాల్‌లో మమతకు మోడీ చురకలు, సభలో స్వల్ప తొక్కిసలాట

- Advertisement -