పూరి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కథ అదేనా?

Puri
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గత కొన్నేళ్లుగా సరైన హిట్స్ లేక చాల ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా తన స్టైల్‌కు పర్ఫెక్ట్‌గా మ్యాచ్‌ అయ్యే ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాను మొదలు పెట్టాడు . డబుల్ దిమాక్‌ అనే ట్యాగ్‌ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పూరి కంబ్యాక్‌ కావాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ఈ విషయంలో ఆయనపై అపార మైన నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. ఈ నేపధ్యంలో నే ఈ సినిమా స్టోరీ లైన్ ఏమై ఉండవచ్చు అనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పక్కన పెడితే పూరి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లో పూరి సరి కొత్త స్టోరీ లైన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

డబుల్ థిమాక్ పూరి…

ఆ లైన్ ఏంటి అంటే పూరి ఈ సారి సైన్స్ ఫిక్షన్ జానర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ సైంటిస్ట్ గా కనిపించబోతోంది. ఆ విషయాన్ని నిధి స్వయంగా మీడియాకు తెలియచేసింది. ఈ మ్యాటర్ లీక్ తో ఈ సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అనే విషయం ఖరారు అయింది.

సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. రామ్ క్యారెక్టర్ ను, అతడి మైండ్ సెట్ ను మార్చేసే శాస్త్రవేత్త పాత్రలో నిధి కనిపిస్తుందట. రామ్ ని ఆమె ఎట్రాక్ట్ చేసి తన ప్రయోగాలకు వాడుకుంటుందట. అందులో భాగంగా మైండ్ స్కానింగ్ ట్రిక్ ని ప్లే చేస్తుందని, దాంతో అది వికటించి డబుల్ థిమాక్ కు దారి తీస్తుందని చెప్తున్నారు.

పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో సాగే మాస్ చిత్రం ఇదని తెలుస్తోంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్, చార్మి కౌర్‌ నిర్మిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా హిట్ తో అయినా పూరి హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది.

చదవండి: షాక్ ఇస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ శాటిలైట్స్ రైట్స్ !

- Advertisement -