త్వరలోనే అన్ని చెప్తా: నితిన్

- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే తానేంటో ప్రూఫ్ చేసుకున్నాడు. ఒకానొక సందర్భంలో వరుస పరాజయాలతో ఇక కోలుకోలేడు అనుకున్న సమయంలో ఇష్క్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

ఆ తరువాత ‘అ ఆ’ సినిమా తరువాత నితిన్ కి ఇంతవరకూ హిట్ పడలేదు. ‘శ్రీనివాస కల్యాణం’పై ఆయన పెట్టుకున్న ఆశలు  నిరాశనే మిగిల్చాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమా చేయనున్నట్టుగా ఆయన చెప్పి చాలా కాలమే అయింది. ఆ ప్రాజెక్టు ఇంతవరకూ పట్టాలెక్కలేదు.

త్వరలోనే షూటింగ్స్…

దాంతో నితిన్ తదుపరి సినిమాల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందనే విషయంలో అభిమానులు అయోమయానికి లోనవుతున్నారు.ఈ నేపథ్యంలో నితిన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ..” నా నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఈ నెల చివరిలో చెబుతాను. పక్కా ప్రామిస్ చేసి చెబుతున్నాను .. త్వరలోనే వాటి షూటింగ్స్ మొదలుకాబోతున్నాయి.

ప్రస్తుతం అవి స్క్రిప్ట్ దశలోవున్నాయి. ఈ ఏడాది నా సినిమాలు రెండు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాను. ఈ విషయంలో ఆలస్యమైనా ఓపికతో వున్న నా అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.

చదవండి : మే 9న రానున్న మహర్షి! మహేష్ ఒప్పుకుంటాడా!

- Advertisement -