బాలీవుడ్ భామ వైపు చూస్తోన్న జక్కన్న! అలియాభట్‌పై కన్ను?

rajamouli targets alia butt
- Advertisement -

aliayabat act as rajamouli rrr movie

భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తొలిసారి మల్టీ స్టారర్‌గా తీస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా రోజూ ఏదో ఒక రకంగా వార్తల్లో చక్కర్లు కొడుతూ ఉంటుంది.  ప్రభాస్‌తో చేసిన బాహుబలి సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందడంతో రాజమౌళి సినిమాలపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది.

ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఈ ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోలుగా టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. దీంతో ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో కలిసి సినిమా తీయబోతున్న ఘనత కూడా మన రాజమౌళికి దక్కబోతోంది.

రాజమౌళి మల్టీ స్టారర్‌లో అలియాభట్ ..

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైపోయింది. మొదటి షెడ్యూల్ అయిపోయిన తరువాత కొంత గ్యాప్ తీసుకుని, ఈ మద్యే సెకెండ్ షెడ్యూల్‌ని మొదలుపెట్టారు చిత్ర యూనిట్. ఇప్పటివరకు ఈ చిత్రంలో నటించే హీరోయిన్స్ ఎవరో మాత్రం చెప్పడం లేదు.

అయితే ఈ  ఆర్ఆర్ఆర్ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ అలియాభట్‌ని తీసుకోవడానికి రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఎలాగూ చిత్రం బాలీవుడ్‌లో కూడా రిలీజ్ అవుతుంది.. కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ అయితే మార్కెట్ పరంగా కూడా సినిమాకి కలిసొస్తుందనేది రాజమౌళి భావనగా చెబుతున్నారు. చూడాలి మరి మన దర్శకధీరుడి ఈ ప్రయత్నాలు ఎంతమేర సఫలం అవుతాయో…

చదవండి: ఎన్టీఆర్ కోసం రాజమౌళిని కలిసిన ఫిట్‌నెస్ ట్రైనర్ స్టీవెన్స్ లాయిడ్

- Advertisement -