రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకేసారి ప్రథమ, ద్వితీయ.. విద్యార్థుల్లో ఉత్కంఠ…

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు గురువారం సాయంత్రం విడుదల కానున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు.

గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. 

చదవండి: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి, తొలి మూడు స్థానాల్లో ఏ జిల్లాలంటే…

ఇప్పటికే వాల్యుయేషన్ పూర్తి చేసిన ఇంటర్ బోర్డు పరీక్షా ఫలితాలకు సంబంధించి ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా సమర్పించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. దీంతో తెలంగాణలోనూ ఇంటర్ ఫలితాల విడుదలకు కేసీఆర్ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంది. 

ఈ నేపథ్యంలో ఏపీలో మాదిరిగానే ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలను తెలంగాణలోనూ విడుదల చేయనున్నారు. 

చదవండి: అయ్యన్నపాత్రుడిపై దిశ కేసు.. ఓ మాజీ మంత్రిపై ఇదే తొలిసారి!

 

- Advertisement -