32.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home క్రైమ్ దారుణం: ఇన్సూరెన్స్ డబ్బు కోసం.. గ్యాస్ లీక్ చేసి, కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త

దారుణం: ఇన్సూరెన్స్ డబ్బు కోసం.. గ్యాస్ లీక్ చేసి, కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త

woman in fire
- Advertisement -

woman in fire

అనంతపురం: అప్పుల బాధ తట్టుకోలేక..  అప్పులు తీర్చడానికి ఒక వ్యక్తి  ఒక ప్లాన్ వేశాడు. కట్టుకున్న భార్య పేరిట ఇన్స్యూరెన్స్ చేయించి అ తర్వాత ఏకంగా భార్యనే హత్య చేశాడు. ఈ దారుణం అనంతపురం జిల్లా సీకే దిన్నె గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కడప జిల్లా బూసిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన గజ్జల రామ సుబ్బారెడ్డికి అదే గ్రామానికి చెందిన మల్లేశ్వరితో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ పోషణ నిమిత్తం వీరు  సీకే దిన్నె గ్రామంలో స్థిరపడ్డారు.

అప్పులు చేసి మరీ స్థలాలు కొని…

సుబ్బారెడ్డి  పనిపాటా లేకుండా ఖాళీగా కాలక్షేపం చేస్తూ భార్య తెచ్చే కూలి డబ్బులపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉంటాయని భావించిన అతను తెలిసిన వారి వద్ద నుంచి భారీ మొత్తంలో అప్పు చేసి మరీ స్థలాలను కొనుగోలు చేశాడు. కానీ తాను పెరుగుతాయని భావించాడు. కానీ అవెప్పటికి పెరగకపోవడంతో.. అప్పులు చేసిన వారికి వడ్డీలు కట్టలేకపోయేవాడు. తను వెంటనే అమ్మేద్దామని అన్నా.. తాను కొన్నదానికన్నా తక్కువకి అడుగుతుండటంతో.. వాటిని అమ్మకుండా అలాగే ఉంచేశాడు..

ఈ క్రమంలో అతడు తీసుకున్న అప్పు  ఎంతకు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు సుబ్బారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. అతడు చేసిన అప్పు వడ్డీతో కలిపి దాదాపు రూ. 6 లక్షలకు చేరుకుంది. దీంతో మల్లేశ్వరి కూడా త్వరగా అప్పు తీర్చేయాలని భర్తపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న రామసుబ్బారెడ్డికి ఒక ఉపాయం తట్టింది.

తన భార్య పేరిట  ఇన్స్యూరెన్స్ చేయించి ఆమెను హత్య చేసి.. వచ్చిన  డబ్బుతో  అప్పులు తీర్చాలనుకున్నాడు. తన పథకంలో భాగంగా భార్యపై రూ. 6 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించి… అనంతరం ఇంట్లోని వంట గదిలో ఉన్న గ్యాస్‌ను లీక్ చేసి తలుపులు మూసేసి తన భార్య కిచెన్‌లోకి వెళ్లిన తర్వాత తాను బయటకు వచ్చేశాడు.

పాపం.. భర్త ప్లాన్ తెలియని మల్లేశ్వరి వంటగదిలోకి వెళ్లి స్టవ్ వెలిగించడంతో ఒక్క మంటలు చెలరేగాయి. వెంటనే సుబ్బారెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. మంటలలో కాలిపోతున్న మల్లేశ్వరిని గమనించిన స్థానికులు.. వెంటనే ఆమెను కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 90 శాతం శరీరం కాలిపోవడంతో మల్లేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ఈ సంఘటనపై సీకే దిన్నే పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న నిందితుడు రామసుబ్బారెడ్డి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -