26.1 C
Hyderabad
Monday, September 21, 2026
- Advertisement -
Home క్రైమ్ షాకింగ్: భర్త హత్యకు భార్య సుపారీ! ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే…

షాకింగ్: భర్త హత్యకు భార్య సుపారీ! ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే…

nagaraju-murdered-by-wife-in-ramakuppam
- Advertisement -

చిత్తూరు: జిల్లాలోని రామకుప్పంలో ఇటీవల కలకలం సృష్టించిన నాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నాగరాజు హత్యోదంతంలో కీలక సూత్రధారి అతడి భార్య సౌమ్య అని పోలీసులు తమ విచారణలో తేల్చారు. దానికి కారణం ఆమెకు ప్రియుడితో ఉన్న వివాహేతర సంబంధమేనని కూడా గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం… సౌమ్య తమ ఇంటికి సమీపంలోనే ఉంటోన్న జనార్థన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నెరపుతోంది. అయితే జనార్థన్‌ను కలుసుకోనివ్వకుండా నాగరాజు అడ్డుగా నిలిచాడు. ఈ నేపథ్యంలో తమ మధ్య ఉన్న సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న అక్కసుతో ఆమె కట్టుకున్న భర్తనే చంపేయాలని పన్నాగం పన్నింది.

భర్త అడ్డు తొలగించుకోవాలనే…

తన ప్రియుడ్ని కలుసుకోకుండా భర్త నాగరాజు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అతని అడ్డు తొలగించుకోవడం తప్ప తమకు మరో దారిలేదని భావించిన సౌమ్య భర్త నాగరాజును చంపేందుకు తెగించింది. ప్రియుడ్ని కలిసి తన భర్తను మట్టుబెడితే రూ.లక్ష ముట్టజెబుతానని తెలిపింది.

పథకంలో భాగంగా ఒక ముఠాతో మాట్లాడుకుని వారికి రూ.20 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. సౌమ్య దగ్గర డబ్బు తీసుకున్న ముఠా సభ్యులు ఏప్రిల్ 30న నాగరాజును చంపేశారు. ఈ హత్య కేసులో ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు భర్తనే హత్య చేయించిన నిందితురాలు సౌమ్యతోపాటు ఆమె ప్రియుడు జనార్థన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందేమో అనే కోణంలో ప్రస్తుతం నిందితులను విచారిస్తున్న పోలీసులు వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -