చెన్నై: సెక్స్ రాకెట్ కేసులో తమిళ సీనియర్ నటి సంగీత బాలన్ అరెస్ట్ అవడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో తమిళ సినీవర్గాల్లో కలకలం రేగింది. చెన్నైలోని పనయూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో సంగీత బాలన్ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు సమచారం అందుకున్న పోలీసులు ఆ రిసార్ట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది విటులు సహా పలువురు యువతులను అదపులోకి తీసుకున్నారు. నటి సంగీతతో పాటు సురేశ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, మెజిస్ట్రేట్ ఇద్దరికి కస్టడీ విధించారు.
అనంతరం తాము అదుపులోకి తీసుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతులను పోలీసులు రెస్క్యూ హోంకు తరలించారు. ఈ సెక్స్ రాకెట్‌లో నటి సంగీత బాలన్‌తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖుల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 1996లో కరుప్పు రోజా తమిళ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన సంగీత బాలన్ అనంతరం పలుచిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లలో నటించారు. అనేక టీవీ ప్రొగ్రామ్స్‌లో కూడా నటించారు. రాధిక శరత్ కుమార్ ‘వాణి రాణి’ సీరియల్‌లో అత్త పాత్రతో సంగీత బాలన్ బాగా పేరుతెచ్చుకున్నారు.