ఘోరం: గట్టిగా పట్టుకుందని.. మహిళ చేతి వేళ్లు నరికి బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన దొంగలు

bike-borne-robbers-1
- Advertisement -

bike-borne-robbersఢిల్లీ: దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బ్యాగ్‌ను గట్టిగా పట్టుకోవడం వల్ల దొంగతనం చేయడం కుదరడం లేదనే కోపంతో మహిళ చేతి  పోవేళ్లను నరికి బ్యాగును లాక్కొని పరారయ్యారు.

సోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని సంగమ్ విహార్‌కు చెందిన షాలినీ గార్గ్ నగరంలోని ఓ ఆసుపత్రిలో ఉన్న తన బంధువును చూసేందుకు ఆటోలో బయలుదేరింది.

ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె హ్యాండ్ బ్యాగును లాక్కొనే ప్రయత్నం చేశారు. అయితే అది వారి చేతుల్లోకి వెళ్లకుండా ఆమె గట్టిగా పట్టుకుంది. దీంతో బైక్‌పై వెనుక కూర్చొన్న దుండగుడు పదునైన కత్తితో ఆమె మూడు చేతి వేళ్లను నరికి బ్యాగును లాక్కుపోయారు.

తన బ్యాగులో రెండు బంగారు ఉంగరాలు, రూ.5 వేలు నగదు ఉన్నాయంటూ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

- Advertisement -