25.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home క్రైమ్ షాకింగ్: తల్లి అయిన ఇంటర్‌ విద్యార్థిని! కారణం ఎవరో తెలుసా?

షాకింగ్: తల్లి అయిన ఇంటర్‌ విద్యార్థిని! కారణం ఎవరో తెలుసా?

- Advertisement -

అనంతపురం: ఈ సమాజం లో జరిగే కొన్ని ఘటనలను చూస్తే, మానవత్వం అనేది ఉందా అనిపించకమానదు. కన్న బిడ్డలాగా చూసుకోవాల్సిన బావే, కసాయి వాడిలా మారి, తన సొంత మరదలి పై కన్నేశాడు. దీనితో ఆ అమ్మాయి గర్భం దాల్చి, ఒక బిడ్డకి జన్మనిచ్చింది.

మరదలిపై పలుమార్లు అత్యాచారం…

దీనిపై పూర్తి వివరాలు చూస్తే.. ఓ ఇంటర్ విద్యార్థిని అంబులెన్స్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కళ్యాణదుర్గానికి చెందిన బాలిక అనంతపురంలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుకుంటోంది. పట్టణంలోనే ఉంటున్న తన అక్కాబావల ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేది.

ఈ క్రమంలో బావ కన్ను మరదలిపై పడింది. ఆమెను బలవంతంగా లొంగదీసుకుని పలుమార్లు కోరిక తీర్చుకున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. గర్భం దాల్చిన బాలిక తనకు ఆరోగ్యం బాగాలేదంటూ ఇటీవల స్వగ్రామానికి వచ్చేసింది. ఆదివారం రాత్రి ప్రసవ వేదన పడుతుండడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

అనంతపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే బాలిక మగ శిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: షాకింగ్: కొత్త పెళ్లికొడుకు అఘాయిత్యం! మరదల్ని కిడ్నాప్ చేసి.. పలుమార్లు అత్యాచారం…

- Advertisement -