25.6 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home క్రైమ్ వరంగల్ ఇంటర్ విద్యార్థిని హత్యాచారం కేసులో పోలీసుల చార్జ్‌షీట్

వరంగల్ ఇంటర్ విద్యార్థిని హత్యాచారం కేసులో పోలీసుల చార్జ్‌షీట్

- Advertisement -

హన్మకొండ: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంటర్ బాలిక హత్య కేసులో తాజాగా పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నిందితుడిని కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు నెల రోజుల్లోనే విచారణ పూర్తిచేశారు. తాజాగా అన్ని ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో పులి సాయిగౌడ్‌ను నిందితుడిగా గుర్తించారు. బాధితురాలిపై నిందితుడు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

ఏం చేశాడంటే…

హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాధిత బాలికతో నిందితుడు సాయికుమార్ గౌడ్‌కు పరిచయం ఏర్పడింది. గత నెల 27న బాలిక బర్త్‌డే కావడంతో తనను కలిసేందుకు రావాలని కోరాడు. సరేనన్న బాలిక భద్రకాళి గుడికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి సాయికుమార్ వద్దకు వెళ్లింది.

వెంటనే బాలికను తీసుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన సాయికుమార్ రెండుసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక అక్కడే మృతి చెందింది. గమనించిన సాయి కుమార్ ఆమె డ్రెస్ మార్చి వేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు.

ఆ మర్నాడు విషయం వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కొన్ని గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

- Advertisement -