బెంగళూరులో చెలరేగిపోతున్న వ్యభిచార ముఠాలు.. లాక్‌డౌన్‌లో సొమ్ము చేసుకుంటున్న వైనం!

- Advertisement -

బెంగళూరు: లాక్‌డౌన్‌లోనూ వ్యభిచార ముఠాలు వెనక్కి తగ్గడం లేదు. యథేచ్ఛగా దందాలు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటున్నాయి. తాజాగా, బెంగళూరులో ఓ హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు.

ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో న‌గ‌రంలోని య‌శ్వంత్‌పుర ప్రాంతంలోని ఓ గెస్ట్‌హౌస్‌‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు నిర్వహకులతోపాటు ఐదుగురు యువ‌తుల‌ను ర‌క్షించి రెస్క్యూ హోంకు త‌ర‌లించారు.

కాగా, గతవారం కూడా సీసీబీ పోలీసులు ఓ వ్యభిచార గృహంపై దాడిచేసి ఏకంగా 27 మంది మహిళలను కాపాడి బెంగళూరులోని రెస్క్యూ హోంకు తరలించారు.

ఈ వ్యభిచార ముఠాలు లాక్‌డౌన్ సమయంలో ఇళ్లలో ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని దందా సాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

నగరంలో మరిన్ని వ్యభిచార ముఠాలు ఉన్నట్లు గుర్తించామని బెంగ‌ళూరు క్రైం బ్రాంచ్ జాయింట్ క‌మిష‌న‌ర్ సందీప్ పాటిల్ తెలిపారు. త్వరలో వాటిపైనా దాడులు నిర్వహిస్తామన్నారు.

- Advertisement -