50 మంది గృహిణులతో సెక్స్.. వీడి స్కెచ్ చూసి షాక్ తిన్న పోలీసులు!

10:09 am, Sun, 2 June 19
Man Arrested For Sexual Abuse Of Over 50 Women

కొట్టాయం: గ‌ృహిణులే వాడి టార్గెట్. మొదట భర్తను మచ్చిక చేసుకుంటాడు.. ఆ తరువాత భార్యకు వల వేస్తాడు. లొంగకపోతే ఫొటోలను అసభ్యకరంగా మార్చి వాటిని ఆమె భర్తకు పంపిస్తానని, సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరిస్తాడు.

అలా బ్లాక్ మెయిల్ చేసి వాడు ఇప్పటివరకు 50 మందికిపైగా మహిళలతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకున్నాడు. చివరికి ఓ మహిళ ఫిర్యాదుతో వీడి ఆగడాలు వెలుగుచూశాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

చదవండి: చేతులు, కాళ్ళు కట్టేసి 51 రోజులపాటు ఆడపిల్లపై…! 

మరిన్ని వివరాల్లోకి వెళితే… కేరళలోని ఎట్టుమనూర్ సమీపంలోని అరీపరంబు ప్రాంతానికి చెందిన ప్రదీష్ కుమార్(25) సోషల్ మీడియాలో అందంగా కనిపించే గృహిణులతో చాటింగ్ చేస్తూ వారి ఫోన్ నంబర్లు, ఫొటోలు సేకరిస్తాడు. చాటింగ్ చేసే సమయంలో వారి కుటుంబ నేపథ్యం, సమస్యలు తెలుసుకుంటాడు. ఇక అక్కడ్నించి వీడి స్కెచ్ మొదలవుతుంది.

మొదట భర్తను ట్రాప్ చేసి…

ఒక యువతి పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేసి.. వాడు ఎంచుకున్న మహిళ భర్తతో తొలుత ఆ ఐడీ అకౌంట్ నుంచి చాటింగ్ చేస్తాడు. అతడు ట్రాప్‌లో పడ్డాక ఆ చాటింగ్ తాలూకు స్క్రీన్ షాట్‌లను అతడి భార్యకు చూపించి.. ‘‘మీ ఆయన మరో మహిళతో చాటింగ్ చేస్తున్నాడు.. కావాలంటే వివరాలు చూడు.. ఆయన అలా చేస్తుంటే నువ్వెందుకు మడిగట్టుకుని కూర్చోవాలి…’’ అంటూ సదరు మహిళను మెల్లగా తనకు అనుకూలంగా మార్చుకుంటాడు.

చదవండి: షాకింగ్: భర్త హత్యకు భార్య సుపారీ! ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే…

మొదట ఆ మహిళతో ఫోన్ ద్వారా చాటింగ్ చేస్తాడు. తరువాత వీడియో చాటింగ్‌లోకి రప్పిస్తాడు. ఈ లోగానే ఆ మహిళకు సంబంధించిన ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి.. వాటిని చూపించి బెదిరిస్తాడు.

తనతో లైంగిక సంబంధానికి ఒప్పుకోవాలని, లేకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరిస్తాడు. దీంతో గత్యంతరం లేక ఆ మహిళ వాడెలా చెబితే అలా చేస్తుంది.

ఇలా ఒకరు.. ఇద్దరు కాదు, ఏకంగా 50 మందికిపైగా గృ‌హిణులను ప్రదీష్ కుమార్ వంచించాడు. ప్రతి మహిళకు చాటింగ్‌కు ముందుగా ప్రదీష్ కుమార్ ఓ కోడ్ ఇస్తాడట. వాడితో చాటింగ్‌కు ముందు ఆ కోడ్ టైప్ చేస్తే.. ఆ మహిళ ఎవరన్నది వాడికి సులువుగా అర్థమవుతుంది. దీంతో ఎవరి కుటుంబ నేపథ్యానికి తగ్గట్లు వారితో చాటింగ్ చేస్తుంటాడన్నమాట.

చదవండి: దారుణం: భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్.. ఆ పైన ఏం చేశారంటే…

మొత్తానికి బాధిత మహిళల్లో ఒకరు వీడి వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ కంత్రీ గాడి శ‌ృంగార లీలలు వెలుగులేకి వచ్చాయి.

సదరు మహిళ ఫిర్యాదు మేరకు శుక్రవారం ప్రదీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో వాడు చెప్పిన విషయాలు విని ముక్కున వేలేసుకున్నారట. గృహిణులను లొంగదీసుకునేందుకు వాడు వేసే స్కెచ్ చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.

చదవండి: దారుణం: మామిడికాయలు కోశాడని దళితుడుని ఉరితీసిన దుర్మార్గులు