26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మూడు రోజుల్లో సీఎంగా జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే …

మూడు రోజుల్లో సీఎంగా జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే …

YS Jagan News, CM YS Jagan News, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: సీఎంగా అధికారం చేప్పట్టిన మూడు రోజుల్లోనే జగన్ తన మార్కు చూపుతున్నాడు. కేవలం మూడు రోజుల్లోనే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ , పలువురి అధికారులతో వరుసగా సమీక్షలు ముందుకుసాగుతున్నారు. మే 30న ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత మూడు రోజుల్లో అనేక కీలక అడుగులు వేశారు.

ఇందులో భాగంగా..వై ఎస్ ఆర్ ఆసరా పింఛన్ ద్వారా వృద్ధుల పెన్షన్ 2000 నుండి 2250 కి పెంచారు. వికలాంగుల పెన్షన్ 2000 నుండి 3000 కి పెంచారు. కిడ్నీ రోగులకు పెన్షన్ 3500 నుండి 10,000 కు పెంచారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం 1000 నుండి 3000 లకు పెంచారు.

44,000 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో ఒత్తిడిలేని విద్య కోసం ప్రతి శనివారం No Bag Day అమలు చేయాలని ఆదేశించారు. మూసివేయబడిన అన్ని ప్రభుత్వ పాఠశాలలు తెరిపించాలని నిర్ణయించారు.

అలాగే YSR అక్షయపాత్ర పథకం ద్వారా బడిపిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్లాన్ రెడి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాణ స్వీకారం ఖర్చును 15 లక్షల్లోనే ముగించేశారు. నెలకు ఒక్క రూపాయి జీతం తీసుకునే పని చేస్తానని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇకపై అతి ఖరీదైన హిమాలయ వాటర్ బాటిల్స్ వంటి ఖరీదైన బ్లాండ్లు నిషేధించి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఆదేశించారు.

అలాగే జగన్ ఎన్నికల ప్రచారం లో హామీ ఇచ్చినట్టుగానే మద్యం నిషేదానికి నడుం బిగించాడు. సంబంధిత అధికారులతో చర్చులు , జరుపుతూ దశల వారిగా మధ్య నిషేధాన్ని అమలు చేయడానికి ప్లాన్ రూపొందించాడు. అలాగే గవర్నర్ ఇచ్చిన ఇప్తార్ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాల్గొని, పలు కీలక విషయాలపై చర్చలు జరిపాడు.

చదవండి: జగన్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో వణికిపోతున్న మాజీ సీఎం చంద్రబాబు!
- Advertisement -