
బ్రిస్టల్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై జయభేరి మోగించింది. ముందుగా అఫ్గానిస్తాన్ 38.2 ఓవర్లలో 207 పరుగులు చేసి ఆలౌటైంది.
ఆఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్‌లలో రహ్‌మత్ షా 43, కెప్టెన్ గుల్బాదిన్ నైబ్ 31, నజీబుల్లా జద్రాన్ 51, రషీద్ ఖాన్ 27 పరుగులు చేశారు. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ కాగా, మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్, ఆడం జంపా చెరో మూడు వికెట్లు తీసుకోగా, మార్కస్ స్టోయినిస్ రెండు, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 34.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 209 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు అరోన్ ఫించ్ (66), డేవిడ్ వార్నర్ 89 (నాటౌట్) అర్ధ సెంచరీలతో జట్టుకు విజయాన్ని అందించారు.
ఉస్మాన్ ఖావాజా 15, స్టీవెన్ స్మిత్ 18 పరుగులు చేశారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ముజీబుర్ రెహ్మాన్, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. డేవిడ్ వార్నర్‌కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.








