విజయవాడ: తమపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కక్షతో ఇద్దరు వ్యక్తులు ఆమెపై కట్టారు. తీవ్రంగా గాయపరచడమే కాకుండా ఆమె జననాంగంలోకి కర్రను పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. వారు పెట్టే చిత్రహింసలకు ఆ మహిళ విలపిస్తుంటే వారు మాత్రం పైశాచికానందం పొందారు. సభ్య సమాజం తలదించుకునేలా, నిర్భయ తరహాలో సాగిన ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు.. కుంపటి రాజు, అంజయ్య అనే వ్యక్తులతో చాలా కాలంగా ఇంటి సరిహద్దు వివాదం ఉంది. గత అక్టోబర్ 1న వీరి మధ్య మళ్లీ ఈ వివాదం చెలరేగింది. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజు, అంజయ్యలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫిర్యాదు చేసిందనే అక్కసుతో…
తమపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో రగిలిపోయారు కుంపటి రాజు,అంజయ్య. ఆ అక్కసుతో ఆ మహిళపై కక్ష పెంచుకున్నారు. నవంబర్ 8న గురువారం బాధిత మహిళ ఒంటిరిగా కనిపించడంతో కుంపటి రాజు, అంజయ్యలు ఆమెపై కర్రలతో దాడి చేశారు.
ఊహించని దాడితో ఆమె స్పృహ తప్పి కిందపడిపోయింది. అంతటితో ఊరుకోకుండా అదే అదనుగా ఆమె పట్ల వారు సభ్య సమాజం తలదించుకునేలా అమానుషంగా ప్రవర్తించారు. వారి వద్ద ఉన్న కర్రను ఆమె జననాంగంలో పెట్టి, హింసించి పైశాచికానందం పొందారు.
ఆమె ఏడుపు విని అటుగా గ్రామస్తులు రావడంతో కుంపటి రాజు, అంజయ్య అక్కడ్నించి పరారయ్యారు. తీవ్ర గాయాలతో కనిపించిన ఆ మహిళను గ్రామస్తులు నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తరువాత అక్కడి వైద్యులు సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ దాడిపై సమాచారం అందుకున్న ముసునూరు పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉందని విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్య విభాగాధిపతి డాక్టర్ సిద్దేశ్వరి తెలిపారు.
చదవండి: షాకింగ్: మద్యం మత్తులో.. సొంత చెల్లెలిపైనే.. అన్నఅత్యాచారం, తండ్రి నిద్రపోగానే…
చదవండి: ఘోరం: అటవీశాఖ వెదురు డిపోలో యువతి మృతదేహం! హత్యకు ముందు అత్యాచారం.. ప్రియుడిపైనే పోలీసుల అనుమానం
చదవండి: షాకింగ్: బాలికను బెదిరిస్తూ.. నాలుగేళ్లుగా వసతి గృహం సూపరింటెండెంట్ కీచకపర్వం