34.1 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home క్రైమ్ దారుణం: ప్రియుడితో సన్నిహితంగా తల్లి! చూసిందని కన్నకూతుర్నే చంపి, నదిలో పడేసింది…

దారుణం: ప్రియుడితో సన్నిహితంగా తల్లి! చూసిందని కన్నకూతుర్నే చంపి, నదిలో పడేసింది…

affair
- Advertisement -

ఛండీఘర్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ కన్న ప్రేమను కూడా మరిచింది. తాను ప్రియుడితో కలిసుండగా చూసిందని.. పదేళ్ల కన్న కూతుర్ని దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన హర్యానాలోని కర్నాల్ పట్టణంలో చోటు చేసుకుంది.

చదవండి: ఇంటికి పిలిచి.: కామవాంఛ తీర్చలేదని మోడల్‌ను దారుణంగా హత్య చేసిన ఫొటోగ్రాఫర్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనమ్ అనే చిన్నారి ఆడుకునేందుకు బయటకు వెళ్లిన సమయంలో.. ఆమె తల్లి లక్ష్మి, తన ప్రియుడు అమిత్ కుమార్‌ను ఇంటికి పిలిపించుకుంది. వారిద్దరూ సన్నిహితంగా ఉండగా.. ఇంటికి వచ్చిన సోనమ్ వారిని చూసింది. అయితే, ఈ విషయాన్నితండ్రికి చెబుతానని చెప్పింది.

దీంతో ఆందోళన చెందిన లక్ష్మి, తన ప్రియుడితో కలిసి సోనమ్ గొంతు నొక్కి చంపేసింది. ఆ తర్వాత సమీపంలోని నదిలో మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టేసి పడేసింది. కొంత సమయం తర్వాత వచ్చిన భర్త.. కూతురు కనబడటం లేదంటూ నాటకం ఆడింది. అంతేగాక, భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

పోలీసుల అనుమానమే నిజమైంది

ఈ క్రమంలో నదిలో సోనమ్ మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టంలో ఆమెది హత్యేనని తేలడంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. చివరకు పోలీసులకు తల్లి లక్ష్మిపైనే అనుమానం వచ్చింది. దీంతో ఆమెను గట్టిగా విచారించగా.. అసలు విషయం వెలుగుచూసింది. నిందితులు లక్ష్మి, అమిత్ కుమార్‌లపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

 

- Advertisement -