పబ్‌‌లో అశ్లీల నృత్యాలు.. పోలీసుల దాడి.. యువతుల అరెస్ట్

- Advertisement -

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌పై దాడి చేసిన పోలీసులు పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు నంబరు 10లో ఉన్న టాట్ పబ్‌లో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులతోపాటు ఎక్సైజ్ అధికారులు ఏకకాలంలో దాడి చేశారు.

ఆ సమయంలో పబ్‌లో యువతీ యువకులు ఉన్నప్పటికీ అశ్లీల నృత్యాల జాడ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఓ ప్రైవేటు సంస్థ ప్రత్యేకంగా ఈ పబ్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని గుర్తించిన పోలీసులు కార్యక్రమానికి వచ్చిన వారి వివరాలను గుర్తింపు పత్రాలతో పోల్చి చూసినప్పుడు సరిపోలలేదు. దీంతో కొందరు యువతను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -