- Advertisement -
వికారాబాద్: తెలంగాణ ఎన్నికల్లో తమ నాయకుడు ఓడిపోయాడన్న మనస్థాపంతో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యా యత్నం చేసిన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
వికారాబాద్ పట్టణంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోడానికి ప్రయత్నించాడు. అయితే చుట్టుపక్కల ఉన్నవారు దీన్ని గమనించి అతన్ని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ బరిలోకి దిగారు. మంగళవారం వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ చేతిలో ఓటమిపాలయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న బంట్వారం మండలం తోరమామిడికి గ్రామానికి చెందిన ఖదీర్ అనే యువకుడు తట్టుకోలేక పోయారు. దీంతో నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయగా స్థానికులు అతన్ని కాపాడి పోలీసులకు అప్పగించారు.
- Advertisement -