పబ్‌ జి గేమ్‌ కు మరో విద్యార్థి బలి

2:55 pm, Wed, 17 April 19
Pubji Game Latest News, Latest Game News, Newsxpressonline

నిజామాబాద్‌: పాపులర్‌ మొబైల్‌ గేమ్‌ ప్లేయర్‌ అన్‌నౌన్స్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ (పబ్‌జి) కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. పబ్‌ జీ గేమ్‌ను ఆడి చాలా మంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.

తాజాగా మరో యువకుడు పబ్‌ జీ గేమ్‌ కు బానిసై ప్రాణాలను తీసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. నిజామాబాద్‌ లో 9 వ తరగతి చదువుతున్న శ్రేయస్‌ అనే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నిన్న రాత్రి పబ్‌ జీ గేమ్‌ ఆడొద్దని తల్లి మందలించడంతో కోపంగా గదిలోకి వెళ్లిన శ్రేయస్‌ ఫ్యాన్‌ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ గేమ్‌ ను భారత్‌ లో నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అనేక మంది పబ్‌ జీ ఆడి మెంటల్‌ బ్యాలెన్స్‌ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం విచారకరం.

చదవండి:  కంటతడి పెట్టిస్తున్న ప్రేమికుల సెల్ఫీ వీడియో! రైలు కిందపడి ఆత్మహత్య!