
నెల్లూరు: మహిళలు, యువతులపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆడపిల్లలని కామాంధుల బారినుండి కాపాడేందుకు ఈ ప్రభుత్వం ఎన్ని చర్యలు, కఠిమైన నిర్ణయాలు తీసుకుంటున్నాకూడా అత్యాచారాలు, హింసాత్మక ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. తాజాగా నెల్లూరులో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లాలోని సూళ్లూరిపేటలో కామాంధులు పైశాచికంగా ప్రవర్తించారు. రాత్రివేళ రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫామ్ మీద వేచి ఉన్న ప్రేమ జంటను బెదిరించారు. ప్రియుడి ఎదుటే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వదిలేయమంటూ బాధితురాలు కాళ్లావేళ్లా పడినా ఆ దుర్మార్గులు కనికరించలేదు.
రైలు కోసం ప్లాట్ ఫారంపై వేచి ఉండగా..
బాధితురాలిని విజయనగరం జిల్లాకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. కాకినాడకు చెందిన యువకుడు, బాధిత యువతి శ్రీసిటిలోని ఓ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. తమ తమ ఊళ్లకు వెళ్లేందుకు బోకారో ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగి ఎక్కేందుకు ఒకటో ప్లాట్‌ఫామ్ చివరిలో ఉన్న బెంచిపై కూర్చున్నారు.
రాత్రి సమయం కావడంతో ప్లాట్ ఫారంపై ఎవరూ లేరు. ఇదే అదనుగా ఐదుగురు యువకుడ్ని కొట్టి అతడి ప్రియురాలిని తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధిత యువతి, ఆమె ప్రియుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ పరిసరాలను పోలీసులు పరిశీలించారు. తీవ్ర రక్తస్రావం అయి గాయాలతో విలవిల్లాడుతున్న యువతిని ఆసుప్రతికి తరలించారు.
ప్రస్తుతం బాధితురాలికి వైద్య చికిత్స జరుగుతోంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
దారుణం: ప్రియుడితో సన్నిహితంగా తల్లి! చూసిందని కన్నకూతుర్నే చంపి, నదిలో పడేసింది…
ఇద్దరు పిల్లల తల్లితో యువకుడి ప్రేమ.. పెద్దలు అంగీకరించరని ఇద్దరూ ఆత్మహత్య
ఇంటికి పిలిచి.: కామవాంఛ తీర్చలేదని మోడల్‌ను దారుణంగా హత్య చేసిన ఫొటోగ్రాఫర్








