షాకింగ్: బాత్రూమ్‌లో డెలివరీ.. ఫ్లష్ చేసేసిన యువతి.. ఇంటి ఓనర్ ఫిర్యాదుతో…

5:38 pm, Tue, 24 September 19
woman-delivered-a-baby-in-toilet-and-flush-out
సికింద్రాబాద్: ఓ హోమియో వైద్యురాలు తనతోపాటు మరో యువతిని తీసుకొచ్చి తలుపుకొట్టింది. ఆ ఇంటి యజమానురాలు తలుపు తెరిచిన వెంటనే ఒక్కసారి మీ బాత్‌రూమ్ ఉపయోగించుకుంటాం.. అర్జెంట్ అని వైద్యురాలు చెప్పడంతో.. పోనీలే పాపం.. అని మానవీయ కోణంలో ఆలోచించిన ఇంటి యజమానురాలు సరేనంటూ తలూపింది. 
చదవండి: నిజామాబాద్‌లో ప్రియుడి అఘాయిత్యం.. గుడికని యువతిని తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్
అంతే ఆ యువతి బాత్‌రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకోగా.. వైద్యురాలు ఆ ఇంటి యజమానురాలికి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయింది. ఇంతలో బాత్‌రూమ్‌లోంచి పసికందు అరుపు.. ఇంటి యజమానురాలికి ఏమైందో అర్థం కాలేదు. అంతలోనే బాత్‌రూమ్ తలుపు తెరుచుకుని ఆ యువతి బయటికొచ్చింది. ఆమె ఒళ్లంతా రక్తసిక్తమై ఉంది.

నిర్ఘాంతపోయిన ఇంటి యజమానురాలు… 

ఏం జరిగిందో అర్థం కాని ఇంటి యజమానురాలు.. బాత్‌రూమ్‌లోకి వెళ్లి అక్కడి కమోడ్‌లోకి చూసి నిర్ఘాంతపోయింది. అందులో అప్పుడే పుట్టిన పసిగుడ్డు రక్తపు మడుగులో కనిపించడంతో ఇంటి యజమానురాలు కెవ్వుమంది. ఏం జరిగిందో అప్పటికిగాని ఆమెకు అర్థం కాలేదు. 
 
ఆ బిడ్డను తియ్యమంటూ ఆ యువతికి ఎంత చెప్పినా ఆమె వినలేదు. దీంతో ఇంటి యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ ఘటన ఈనెల 21న సికింద్రాబాద్‌, రసూల్‌పురాలోని ఓ ఇంట్లో చోటు చేసుకుంది. 
చదవండి: మెట్రో పిల్లర్ ప్లాస్టరింగ్ పెచ్చులూడి పడి.. మహిళ దుర్మరణం
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ హృదయవిదారక ఘటన.. ఇందుకు సాక్ష్యంగా నిలిచిన ఇంటి యజమానురాలు, బేగంపేట పోలీసుల కథనం ప్రకారం…

అసలేం జరిగిందంటే…

రసూల్‌పురా నివాసి బండారి సోనీ అనే మహిళ ఇంటికి ఈ నెల 21న ఉదయం 11.45 గంటలకు ఓ హోమియో క్లినిక్‌కు చెందిన వైద్యురాలు రేణు ఛాత్వాని వచ్చి తలుపు తట్టింది. ఆమెతో పాటు ఓ యువతి (22) కూడా ఉంది. తమ క్లినిక్‌లో బాత్‌రూమ్ లేదని.. బాత్‌రూమ్ వాడుకోడానికి ఆ యువతిని అనుమతించాలని కోరింది.
 
మానవీయ దృక్పథంతో ఇంటి యజమానురాలు సోనీ అంగీకరించగా.. ఆ యువతి బాత్‌రూంలోకి వెళ్లి గడియ పెట్టుకొంది. కొంత సేపటి తర్వాత ఓ చిన్నారి ఏడుపు విన్న సోనీ ఆశ్చర్యానికి గురై.. ఏమైందంటూ ఒక్కసారిగా గట్టిగా అరిచింది.
 
అదే సమయంలో బాత్‌రూమ్‌లోంచి ఆ యువతి తీవ్ర రక్తస్రావంతో బయటకు వచ్చింది. వెంటనే సోనీ బాత్‌రూంలోకి వెళ్లి చూడగా… అప్పుడే పుట్టిన శిశువు టాయిలెట్‌లో కనిపించింది. కంగుతిన్న సోనీ శిశువును బయటకు తీయమని యువతికి  చెప్పగా.. ఆమె నిరాకరించింది.
చదవండి: టెక్కీ వికృత చేష్టలు.. ఉద్యోగం పేరుతో 600 మంది అమ్మాయిల నగ్నఫొటోలు సేకరించి…
ఈలోగా సోనీ కుమారులు అక్కడికి వచ్చి ఏం జరిగిందో తెలుసుకుని.. ఆ యువతి నుంచి వివరాలు సేకరించి ఆమె బంధువులకు సమాచారం ఇవ్వడంతోపాటు టాయిలెట్‌లో ఉన్న శిశువును బయటకు తీశారు. మరోవైపు బేగంపేట పోలీసులకు కూడా సమాచారం అందించి.. యువతిని, పుట్టిన శిశువును గాంధీ ఆస్పత్రికి తరలించారు.
 
అక్కడ పరీశీలించిన వైద్యులు అప్పటికే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట పోలీసులు వెల్లడించారు.

అయితే కథ వెనుక కథ ఏమిటంటే….

గర్భం దాల్చిన ఆ యువతి హోమియో వైద్యురాలి వద్దకు వెళితే ఆమె గర్భస్రావం కోసం మందులు ఇచ్చినట్లు సమాచారం.
దాంతో ఆ యువతికి  కడుపు నొప్పి తీవ్ర రూపం దాల్చడంతో పక్కింట్లోకి వెళ్లి వారి బాత్‌రూంను వాడుకునే సౌకర్యం కల్పించిన సదరు హోమియో వైద్యురాలు ఆ తరువాత వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.