తాడికల్: కరీంనగర్ జిల్లాలో పరువు హత్య సంచలనం రేపింది. తాడికల్‌కు చెందిన గడ్డి కుమార్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తాడికల్ శివారులోని వంకాయగూడెం గ్రామం వద్ద ఓ పత్తి చేనులో మంగళవారం ఉదయం కుమార్ మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు.
కుమార్‌కు అదే గ్రామానికి చెందిన అమ్మాయితో చాలాకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో ఆ అమ్మాయి కుటుంబనికి చెందిన వారే తమ కుమారుడిని హతమార్చి ఉంటారని కుమార్ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కుమార్ మరణవార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు సంఘటన స్థలనికి చేరుకుని అక్కడ ఆందోళన చేపట్టారు.
ఈ సమాచారం అందగానే శంకరపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై రాళ్ళతో దాడి చేసి వాటి అద్దాలను పగులగొట్టారు. అంతేకాదు, కుమార్‌ను హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి.