బంధువుల చేతిలో వ్యక్తి మృతి.. మార్చురీ నుంచి మృతదేహం మాయం

- Advertisement -

ముంబై: హత్యకు గురైన ఓ వ్యక్తి మృతదేహం ఏకంగా ఆసుపత్రి మార్చురీ నుంచి మాయమైంది. సినీ పక్కీలో ఉన్న ఈ తంతు ముంబైలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

బంధువుల చేతిలోనే హత్యకు గురైన ఓ వ్యక్తి మృతదేహం.. ఆస్పత్రిలోని మార్చురీ నుంచి మాయమైంది. ఈ ఘటన ముంబైలోని రాజావడి హాస్పిటల్‌లో జరిగింది.

ఈ నెల 3న ఓ వ్యక్తిని అతడి బంధువులే హత్యచేశారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో రాజావడి ఆస్పత్రి నుంచి మృతుడి శరీరం మాయమవడంతో కలకలం రేగింది.

‘మూడు రోజులుగా నా కుమారుడి మృతదేహం కోసం వెదుకుతున్నా. వాడికి కనీసం అంత్యక్రియలు చేయడం కూడా కుదరదా?’ అంటూ మృతుడి తల్లి ఆవేదన చెందుతోంది.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక పక్క హత్య కేసు నడుస్తుండగానే మృతదేహం మాయమవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అతడిని హత్యచేసిన బంధువులే మృతదేహాన్ని మాయం చేసి ఉంటారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

- Advertisement -