
బెంగళూరు: సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడడం కొత్తేమీ కాదు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లను ఉపయోగించుకుని ఎంతోమంది మరెంతోమందిని మోసగించిన ఘటనలు ఉన్నాయి. తాజా ఉదంతం కూడా ఈ కోవకే చెందినది.
ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో ఫేక్ ప్రొఫైల్ సృష్టించి పలువురు అబ్బాయిలను స్నేహం, ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడో యువకుడు. నిజంగానే తమతో అమ్మాయి చాటింగ్ చేస్తోందని భ్రమపడి మరికాస్త అడ్వాన్స్ అయ్యే అబ్బాయిలే ఇతడి టార్గెట్. అంతేకాదు, తన మొబైల్ ఫోన్‌లో వాయిస్ ఛేంజర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని వారితో అమ్మాయి మాదిరిగానే మాట్లాడి ముగ్గులోకి దించేవాడు.
చదవండి: అప్పు తీర్చలేదని..: స్నేహితుడి హత్య, ముక్కలుగా చేసి టాయ్‌లెట్ పడేశాడు
ఆ తరువాత ఎస్‌ఐ అవతారంలో వాళ్లను బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు. చివరకు అతడి నిజ స్వరూపం పోలీసులకు తెలిసిపోయింది. దీంతో వారు రంగ ప్రవేశం చేసి ఈ నకిలీ ఎస్‌ఐని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…
‘భవిక’ పేరుతో ఫైక్ ప్రొఫైల్ సృష్టించి…
కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ నగరానికి చెందిన సిద్దప్ప ఫేస్‌బుక్‌లో ‘భవిక’ పేరుతో ఫైక్ ప్రొఫైల్ సృష్టించి.. పలువురు యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించేవాడు. దీంతో యువకులు తేలిగ్గానే పడిపోయేవారు. ఆపైన వారితో చాటింగ్ చేస్తూ.. ప్రేమ పేరుతో ముగ్గులోకి దించేవాడు. వాళ్ల వ్యక్తిగత వివరాలు కూడా తీసుకునే వాడు.
కొంతమంది యువకులు మరింత అడ్వాన్స్ అయి ఫోన్ కూడా చేసేవారు. సిద్దప్ప తన మొబైల్ ఫోన్‌లో వాయిస్ ఛేంజర్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించడంతో అతడి మాటలు అమ్మాయి గొంతుకగా మారిపోయేవి.
చదవండి: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి: తాగొద్దన్నందుకు మద్యం మత్తులో భార్యను చంపేశాడు
అలా కొన్నాళ్లు గడిచాక తనతో ఫోన్‌లో మాట్లాడే, చాటింగ్ చేసే అబ్బాయిల ఇళ్లకు ఎస్ఐ వేషంలో వెళ్లి.. భవిక అనే అమ్మాయి తనకు ఫిర్యాదు చేసిందని, విచారణ కోసమే తాను వచ్చానని, ప్రేమ పేరుతో ఆమెను మీరు వంచించారంటూ బెదిరించేవాడు. కేసు ఫైల్ అవుతుందంటూ మొదట వారిని పలు రకాలుగా బెదిరించి, వారు ఆందోళనకు గురవగానే.. బేరసారాలు మొదలుపెట్టేవాడు.
ఇంత మొత్తం ఇస్తే.. కేసు నుంచి తప్పించే ఏర్పాట్లు చేస్తానంటూ వారి వద్దనుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవాడు. ఇలా ఈ నకిలీ ఎస్ఐ సిద్దప్ప.. మైసూరుతోపాటు బెంగళూరు తదితర ప్రాంతాల్లో పలువురు యువకులను, వారి తల్లిదండ్రులను బెదిరించి భారీ మొత్తాల్లో డబ్బు వసూలు చేశాడు.
చదవండి: షాకింగ్: భర్తపై ఆ అనుమానం.. కాళ్లు, చేతులు కట్టేసి మర్మాంగాన్ని కోసేసిన భార్య!
మైసూరులోని శక్తినగర్‌కు చెందిన ఓ యువకుడి ఇంటికి ఇలాగే వెళ్లగా సిద్దప్ప పాచిక బెడిసికొట్టింది. కొద్దిరోజులుగా శక్తినగర్‌కు చెందిన శారదమ్మ అనే మహిళతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్న సిద్దప్ప చాటింగ్ చేస్తున్నప్పుడు ఆమె కొడుకు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నట్లుగా తెలుసుకున్నాడు.
రెండు రోజుల క్రితం ఎస్ఐ వేషంలో ఆమె ఇంటికెళ్లాడు. ‘‘బెంగళూరులో ఉంటోన్న మీ అబ్బాయి ప్రేమ, పెళ్లి పేరుతో కొంతమంది యువతులను మోసం చేసినట్లుగా మాకు ఫిర్యాదులు అందాయి. ఆ కేసుల విచారణ గురించే నేను ఇక్కడికొచ్చాను..’’ అంటూ నమ్మబలికాడు. అతడి చెప్పినది వినగానే శారదమ్మ, ఆమె భర్త నారాయణగౌడ్ కంగారుపడ్డారు.
చదవండి: బాలికపై 11 మంది గ్యాంగ్ రేప్: హోంమంత్రి సీరియస్, మహిళా అధికారికి దర్యాప్తు బాధ్యతలు, అవే కీలకం…
అయితే సిద్దప్ప ఒప్పుకోలేదు. రూ.50 వేలు ఇస్తే తప్ప మీ కొడుకు కేసులోంచి బయటకు రావడం కష్టమని స్పష్టం చేయడంతో.. సరే డబ్బు సమకూర్చుకుని వస్తానంటూ శారదమ్మ భర్త నారాయణ గౌడ్ బయటికి వెళ్లాడు. అతడు డబ్బు తీసుకొస్తాడని అనుకున్న సిద్దప్ప వారింట్లోనే కూర్చున్నాడు.
సిద్దప్ప ప్రవర్తనపై ఆదినుంచీ అనుమానంగా ఉన్న నారాయణగౌడ్ నేరుగా ఉదయ్ నగర్ పోలీసుల వద్దకెళ్లి సమాచారం అందించడంతో అసలు పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ఐ జైకీర్తి హుటాహుటిన శారదమ్మ ఇంటికి చేరుకుని ఎస్ఐ యూనిఫాంలో ఉన్న సిద్దప్పను ప్రశ్నించగా.. తాను ఇంటెలిజన్స్ ఎస్ఐని అంటూ తొలుత సిద్దప్ప బుకాయించాడు.
దీంతో వారు అతడి గుర్తింపు కార్డు, ఇంటెలిజన్స్ విభాగానికి సంబంధించిన పలు విషయాలపై ప్రశ్నించగా అతడు నోరు వెళ్లబెట్టాడు. దీంతో సిద్దప్పను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు తమైదైన శైలిలో ప్రశ్నించడంతో అతడి మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు సిద్ధప్పను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించారు.








