అక్కినేని ఫ్యామిలీకి ఏమైంది? అసహనంలో అభిమానులు!

3:26 pm, Fri, 8 February 19
akkineni with his son akhil

akkineni-

హైదరాబాద్: అక్కినేని ఈ పేరుకి టాలీవుడ్ లో ఒక చరిత్ర ఉంది. అలనాటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు నుండి నేటి కింగ్ నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సుశాంత్, సుమంత్ ఇలా చాలామందే ఉన్నారు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో మిగిలిన స్టార్ హీరోలు భారీ బ్లాక్ బ్లాస్టర్ లతో దూసుకుపోతుంటే, అక్కినేని హీరోలు మాత్రం విజయం కోసం ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా అక్కినేని యువ సామ్రాట్ కింగ్ నాగార్జున సరైన హిట్ అందుకొని మూడేళ్లు దాటిపోయింది. గత మూడు సంవత్సరాల కింద వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమానే చివరి హిట్. ఆ తరువాత చేసిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అభిమానులని మేపించలేకపోయింది.

అఖిల్ ఆలా.. చైతూ ఇలా…

ఇది ఒక సమస్య అయితే, మరో పక్క తన రెండో నట వారసుడు అఖిల్ టాలీవుడ్ ప్రస్థానం పట్ల అసంతృప్తి తో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంత జాగ్రత్త వహించినా ఎంత టైం తీసుకుని హిట్ ట్రాక్ ఉన్న దర్శకులను తీసుకున్నా వాళ్ళకో ప్లాప్ వచ్చి పడుతోందే తప్ప అఖిల్ కోరుకున్న సక్సెస్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది.

 

ఊహ తెలియని బుడి బుడి నడకల పసి వయసులోనే సిసింద్రీ లాంటి సూపర్ హిట్ కొట్టిన అఖిల్ ఇలా వయసుకు వచ్చాక మొదటి హిట్ కోసం ఇంతగా ఎదురుచూసే పరిస్థితి వస్తుందని ఎవరు మాత్రం ఊహించగలరు చెప్పండి. అఖిల్ నటించిన మూడు సినిమాలు ఘోర పరాజయాలని చవిచూశాయి.

మరోపక్క చైతు గత రెండేళ్లుగా సరైన హిట్ కొట్టలేకపోయాడు. ఇంకోవైపు మేనల్లుడు సుమంత్ కం బ్యాక్ సజావుగా లేదు. సుబ్రమణ్యపురం, ఇదం జగత్ లో హీరోగా చేసినా ఎన్టీఆర్ కథానాయకుడులో స్పెషల్ రోల్ వేసినా అన్ని డిజాస్టర్లే. ఇక సుశాంత్ అనే హీరో ఉన్నాడనే సంగతే ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయారు.

చదవండి: ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో సుమంత్ గెటప్, నటన చూశాక.. మనసు మార్చుకున్న కింగ్ నాగార్జున!?

 

ఈ నేపధ్యంలో జరుగుతున్న పరిణామాల పట్ల నాగ్ కొంచెం సీరియస్ గానే ఉన్నాడని సన్నిహితుల మాట . ఫ్యామిలీలో ఏ హీరోకీ సరైన హిట్ ఎందుకు రావడం లేదో తీవ్రంగా విశ్లేషించే పనిలో పడ్డట్టు తెలిసింది. అఖిల్ గతంలోనే సత్య పినిశెట్టి లైన్ కు ఓకే చెప్పాడు. ఇప్పుడు అది సైతం పునఃపరిశీనలలో ఉందని సమాచారం . మరోవైపు అఖిల్ నాలుగో సినిమాతో అయిన తన సత్తా చూపాలని అనుకుంటున్నాడు.

చైతు మజిలీ, వెంకీ మామలతో బిజీగా ఉన్నప్పటికీ అవి హిట్ అయితేనే కాస్త మార్కెట్ లో పుంజుకోవచ్చు. ఈ పరంపర ఇలాగె కొనసాగితే అక్కినేని బ్రాండ్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తాను ఓకే చెప్పిన మన్మధుడు సీక్వెల్ తో పాటు అఖిల్ చైతుల ఫ్యూచర్ ప్లాన్ గురించి నాగ్ చాలా తీవ్రంగా మేధో మధనం చేస్తున్నట్టు టాక్.

ఏది ఏమైనా హీరోల పరిస్థితి ఇలా ఉంటె, అక్కినేని అభిమానుల భాద వర్ణనాతీతం అని చెప్పాలి. చూడాలి మరి అక్కినేని హీరోలు తమ జోరుని ఎప్పుడు చూపిస్తారో…