

హైదరాబాద్: టాలీవుడ్ లో చాలామంది యువహీరోలు ప్రస్తుతం రాణిస్తున్నారు.అలాంటి వారిలో హీరో నిఖిల్ కూడా ఒకడు. తన కెరియర్ మొదటి నుండి విభిన్నమైన పాత్రలని ఎంచుకుంటూ పోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మొదటగా ముద్ర అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ టైటిల్‌ని తొలగించి మరో పేరుని ఫిక్స్ చేశారు.
అర్జున్ సురవరం…
ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది. అలాగే టీఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి అర్జున్ సురవరం టైటిల్ ను ఖరారు చేసి, ఫస్టులుక్ ను వదిలారు. న్యూస్ ఛానల్ కి సంబంధించిన ఓబీ వ్యాన్ రన్నింగ్‌లో ఉండగా, దాంట్లో నుంచి సీరియస్‌గా ఫోటోలు తీస్తూ ఈ పోస్టర్లో నిఖిల్ కనిపిస్తున్నాడు.
ఈ సినిమాలో ఆయన పాత్రపేరు ‘అర్జున్ సురవరం’, చివరికి అదే టైటిల్ ను ఖరారు చేయడం విశేషం. మార్చి 29న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 2016లో తమిళంలో వచ్చిన ‘కణిథన్’ సినిమాకి ఇది రీమేక్. అధర్వ మురళి , కేథరిన్ జంటగా నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. వైవిధ్యభరితమైన చిత్రం అనిపించుకుంది.
మరి ఇక్కడ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అలాగే ఈ సినిమా నిఖిల్ కెరీర్‌కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.
చదవండి : మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయదేవరకొండ ! నూతన దర్శకుడితో మరో ప్రయోగం !








