22.8 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home ఎన్ఆర్ఐ అమెరికా వీసా స్కాం: తెలుగు విద్యార్థులు ఈనెల 5 లోగా అమెరికా విడిచి వెళ్లిపోవడమే ఉత్తమం, లేదంటే…

వీసా స్కాం: తెలుగు విద్యార్థులు ఈనెల 5 లోగా అమెరికా విడిచి వెళ్లిపోవడమే ఉత్తమం, లేదంటే…

- Advertisement -

indian-students-in-us-visa-scamవాషింగ్టన్: అమెరికాలో వీసా స్కాంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ఈ నెల 5లోగా అమెరికా విడిచి స్వదేశానికి వెళ్లిపోవడమే ఉత్తమం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కాంలో ఇరుక్కున్న తెలుగు విద్యార్థులు అక్కడి అధికారులు అరెస్ట్ చేస్తారనే భయంతో తమ ఇళ్లకు కూడా వెళ్లకుండా.. రోడ్ల మీదే తిరుగుతున్నారు. వాళ్లకు తెలిసిన వాళ్లని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: వీసా స్కాం: 30 మంది తెలుగు విద్యార్థుల విడుదల, భారత ఎంబసీ ముమ్మర యత్నాలు…

ఎఫ్‌-1 వీసా కోసం ఫార్మింగ్టన్‌ హిల్స్ యూనివర్సిటీలో చేరి.. మొదటి రోజునే సీపీటీ (కరిక్యులమ్ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) తీసుకున్నవాళ్లు, రెండో ఎమ్మెస్‌ చేసేవాళ్లు ఉన్నపళంగా.. లేదా ఫిబ్రవరి 5 లోపు తిరిగి స్వదేశానికి వెళ్లిపోతేనే మంచిదని ఇమ్మిగ్రేషన్‌ లాయర్లు సూచిస్తున్నారు.

న్యాయవాదులను సంప్రదించి, వారి సలహా తీసుకుని.. సమీపంలోని ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయాలకు వెళ్లి స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోతామని చెబితే (వాలంటరీ డీపోర్టేషన్‌).. అందుకు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అంగీకరించే అవకాశం ఉంది.

ప్రభుత్వాలు, తెలుగు సంఘాల ముమ్మర ప్రయత్నాలు…

మరోవైపు వీసా స్కాంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహాయం చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అటు ఏపీ ఎన్నార్టీ నుంచి ఏపీ ప్రభుత్వం తెలుగు విద్యార్థులకు సహాయం చేయడం ప్రారంభించగా.. ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అమెరికా కాన్సులర్ అధికారికి ఈ విషయమై ఇప్పటికే వినతిపత్రం కూడా అందించారు.

ఈ కష్టం నుంచి తెలుగు విద్యార్థులను గట్టెక్కించేందుకు ఉన్న మార్గాలపై అమెరికాలోని తెలుగు సంఘాలు కూడా గట్టి కసరత్తు చేస్తోన్నాయి. అక్కడి అధికారులను, సెనేటర్లను కలిసి సమస్య పరిష్కారానికి ఆయా సంఘాల నేతలంతా చర్చలు కూడా జరుపుతున్నారు.

‘‘ఇప్పటికే వందల మంది విద్యార్థులు సాయం కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. అధికారులు అరెస్టు చేస్తారనే భయంతో వారంతా తమ ఇళ్లకు కూడా వెళ్లట్లేదు. రోడ్ల మీదే తిరుగుతున్నారు. తెలిసిన వాళ్లని ఆశ్రయిస్తున్నారు..’’ అని ఏపీ ఎన్నార్టీ మీడియా సమన్వయకర్త సాగర్ దొడ్డపనేని వెల్లడించారు.

చెప్పి వెళ్లాలి.. లేకుంటే…

న్యాయవాదులను సంప్రదించి, వారి సలహా తీసుకుని.. సమీపంలోని ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయాలకు వెళ్లి స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోతామని విద్యార్థులు చెబితే (వాలంటరీ డీపోర్టేషన్‌).. అందుకు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అంగీకరించే అవకాశం ఉందట.

ఒకవేళ ఎవరైనా విద్యార్థులు ఇలా చెప్పకుండా స్వదేశానికి వెళ్లిపోతే అలాంటి వారిపై మూడేళ్లు నిషేధం విధించే ప్రమాదం కూడా ఉందట. అందుకే అధికారులకు చెప్పి వెళ్లడమే మంచిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తేడా లేకుండా సాయం…

‘‘వీసా స్కాంలో ఇప్పటికే అమెరికాలో అరెస్టయిన తెలుగు విద్యార్థులందరికీ.. ఏపీ, తెలంగాణ అనే తేడా లేకుండా సాయం చేయాలని, అవసరమైతే లాయర్‌ ఫీజులు కూడా ‘ఏపీఎన్నార్టీ అత్యవసర నిధి’ నుంచి ప్రభుత్వం తరఫునే ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఏపీ ఎన్నార్టీకి ఆదేశాలు జారీ చేశారు..’’ అని ఏపీ ఎన్నార్టీ మీడియా సమన్వయకర్త సాగర్‌ దొడ్డపనేని తెలిపారు.

- Advertisement -