శోకసంద్రంలో టాలీవుడ్.. విజయనిర్మలకు పలువురి నివాళి, కృష్ణకు ఓదార్పు…

11:56 pm, Thu, 27 June 19
cm-kcr-tribute-to-vijaya-nirmala

హైదరాబాద్: నటిగా, దర్శకురాలిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన విజయనిర్మల మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున విజయనిర్మల మరణించారు. దీంతో కృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

విజయనిర్మల భౌతిక కాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో చివరిసారి విజయనిర్మల భౌతిక కాయాన్ని సందర్శించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి చేరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కృష్ణ నివాసానికి చేరుకుని విజయనిర్మల పార్థివ దేహానికి నివాళి అర్పించారు.

విజయనిర్మల భౌతిక కాయం వద్ద విలపిస్తోన్న ఆమె భర్త కృష్ణను ఆయన ఓదార్చారు. సీఎం కేసీఆర్‌తోపాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు టీఆర్ఎస్ నేతలు విజయనిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 

megastar-chiranjeevi-tribute-to-vijaya-nirmala megastar-chiranjeevi-with-krishnaమెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ నివాళులు…

విజయనిర్మల మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. కృష్ణ నివాసానికి చేరుకున్న ఆయన అక్కడ విజయ నిర్మల భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కృష్ణను ఓదార్చారు.

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఆమె భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విజయనిర్మల మృతి వార్త ఎంతో బాధ కలిగించిందన్నారు.

నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా విజయనిర్మల తన ప్రతిభ చాటుకున్నారని, ఎన్నో ఘనవిజయాలు సొంతం చేసుకుని మహిళలకు ఆమె ఆదర్శంగా నిలిచారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. 

pawan-kalyan-at-vijaya-nirmala-body