
హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’.
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో వస్తుంది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నాడు.
చదవండి: తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘మహర్షి’…
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు గాయాలవ్వడంతో షూటింగ్ వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఇద్దరు హీరోలు గాయాల నుంచి కోలుకోవడంతో రాజమౌళి మరో కొత్త షెడ్యూల్ కోసం సిద్ధం చేస్తున్నాడు.
ఎన్టీఆర్ బర్త్ డే అయిపోయిన తర్వాత రోజు అంటే మే 21 నుంచి ఈ కొత్త షెడ్యూల్ ప్రారంభించడానికి రాజమౌళి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. పైగా ఈ షెడ్యూల్ కూడా హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగబోతుంది. అక్కడే ఆర్‌ఆర్‌ఆర్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్ నిర్మించారు. ఇక ఈ షెడ్యూల్లోనే హీరోయిన్ అలియా భట్ కూడా అడుగు పెట్టనుందని తెలుస్తోంది.








