23.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ నాని దొంగతనం చేస్తాడంటా….!

నాని దొంగతనం చేస్తాడంటా….!

- Advertisement -

హైదరాబాద్: వరుసగా హిట్లు కొట్టి….గత రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో నేచురల్ స్టార్ నాని హిట్ రేసులో వెనుకబడిపోయాడు. కానీ తాజాగా వచ్చిన జెర్సీ చిత్రంతో నాని మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేశాడు. జెర్సీలో తన నటనతో నాని అందరినీ ఏడిపించేశాడు. జెర్సీ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టి నాని ఖాతాలో మరో హిట్ చేరింది.

ఇక నాని జెర్సీ సినిమా తర్వాత  గ్యాంగ్ లీడర్‌గా రాబోతున్నాడు.  స్క్రీన్ ప్లేతో మాయ చేసే విక్రమ్ కే కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. హ‌లో త‌ర్వాత ఈయ‌న తెర‌కెక్కిస్తున్న సినిమా ఇదే.

చదవండి: తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘మహర్షి’…

అయితే ఈ చిత్రంలో నాని దొంగ‌గా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇందులో ఐదుగురు లేడి క్యారక్టర్స్ ఉన్నాయంట… ఆ లేడీస్‌కి నాని లీడ‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. పైగా ఈ చిత్రంలో దొంగతనం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా కామెడీగా ఉంటాయ‌ని తెలుస్తుంది.

ఇక గ్యాంగ్ లీడ‌ర్‌లో నానికి జోడీగా ఇద్ద‌రు హీరోయిన్లు న‌టిస్తున్నారు. మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ ఇందులో ఫీమేల్ లీడ్ చేస్తున్నారు. అలాగే ఆర్‌ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్ర‌తినాయ‌క పాత్ర చేస్తుండ‌టం విశేషం. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

చదవండి తీవ్ర విషాదంలో మెగాస్టార్! ‘సైరా’లో మరో అపశృతి!
- Advertisement -