26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఆ కారణంతోనే జగన్ తెలంగాణలో దుకాణం సర్దేశారు! టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

ఆ కారణంతోనే జగన్ తెలంగాణలో దుకాణం సర్దేశారు! టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

YS jagan Updates, KCR Latest News, Devineni Uma Latest News, Newsxpressonline
- Advertisement -

విజయవాడ: ఏపీ ప్రతిపక్ష నేత హైదరాబాద్ లోటస్ పాండ్‌ నుంచి అమరావతికి మకాం షిఫ్ట్ చేస్తున్నారని వార్తలపై ఏపీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. ఈ రోజు ఉదయం ఆయన విజయవాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ….ఈ నెల 23 తర్వాత వైసీపీ దుకాణం బంద్ కాబోతోందని అన్నారు.

అయితే లోటస్ పాండ్‌లోని వైసీపీ దుకాణాన్ని కూడా మూసేయమంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి జగన్‌కు ఆదేశాలు వెళ్లాయన్నారు. ఇక ఎన్నికల ఖర్చుల కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేశానని, మునిగిపోయే పడవలాంటి నిన్ను పట్టుకుని ముందుకు వెళ్లడానికి తాను సిద్ధంగా లేనని జగన్‌తో కేసీఆర్ తేల్చి చెప్పారని ఉమ ఎద్దేవా చేశారు.

చదవండి: ఆ ఐదు సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది…

అలాగే 23 తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం నుంచి తనకు చిక్కులు ఉండకూడదంటే తెలంగాణలో జగన్ తన దుకాణాన్ని మూసేసుకోవాల్సిందేనంటూ కేసీఆర్ నుంచి జగన్‌కు ఆదేశాల వెళ్లాయని ఉమ వివరించారు.

అందుకే కేసీఆర్ ఆదేశాలతో జగన్ తన దుకాణాన్ని ఏపీకి మారుస్తున్నారని, అరాచక శక్తులు ఏపీలో అడుగుపెడుతున్నాయని పేర్కొన్నారు.

చదవండి: లోటస్ పాండ్ టు అమరావతి.. జగన్ మకాం మార్చడానికి అసలు కారణం ఇదే!
- Advertisement -