28.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రగిరిలో అర్ధరాత్రి హైడ్రామా! చెవి రెడ్డి అరెస్ట్!

చంద్రగిరిలో అర్ధరాత్రి హైడ్రామా! చెవి రెడ్డి అరెస్ట్!

Chevi Reddy Latest Updates, Chandragiri Latest News, AP Election Updates, Newsxpressonline
- Advertisement -

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో మే 19న రీపోలింగ్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తయిన 34 రోజుల తర్వాత ఇక్కడ రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించడం విశేషం. మొత్తం అయిదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుండగా, వీటిలో ఒకటైన ఎన్‌ఆర్‌ కమ్మపల్లిలో గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఈ గ్రామంలోని ఓటర్లకు వైసీపీ నేతలు డబ్బులు పంచడంతో టీడీపీ కార్యకర్తలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోక్షిత్‌రెడ్డి తన అనుచరులను వెంటపెట్టుకుని గ్రామంలోకి రావడానికి ప్రయత్నించారు.

చదవండి: చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్తత! వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డిని అడ్డుకున్న కమ్మపల్లి గ్రామస్తులు…

టీడీపీ శ్రేణులు ఆయన్ను అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాల మద్దతుదారులు గుమికూడటంతో ఏ క్షణానికి ఏం జరుగుతుందోననే భయాందోళన ఏర్పడింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తిమ్మరాజుపల్లి వైపు నుంచి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సీకేపల్లి వైపు నుంచి ఎన్‌ఆర్‌కమ్మపల్లి గ్రామ పొలిమేరలకు చేరుకున్నారు. రెండు వర్గాలూ వంద మీటర్ల దూరంలో నిలిచిపోయాయి.

దీనిపై సమాచారం అందుకున్న తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్భురాజన్‌ పోలీసులతో సహా అక్కడికి చేరుకుని రెండు వర్గాలతో చర్చించినా ఫలితం లేకపోయింది. రాత్రి 10 గంటల తర్వాత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, వైసీపీ కార్యకర్తలు వాహనానికి అడ్డుపడటంతో పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. అనంతరం చెవిరెడ్డి భాస్కరరెడ్డిని రేణిగుంట పోలీసుస్టేషన్‌కు తరలించారు.

చదవండి: ఆ కారణంతోనే జగన్ తెలంగాణలో దుకాణం సర్దేశారు…
- Advertisement -