22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సెకండ్ మూవీ.. హీరోయిన్లుగా శృతి హాసన్, నివేత పేతురాజ్!?

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సెకండ్ మూవీ.. హీరోయిన్లుగా శృతి హాసన్, నివేత పేతురాజ్!?

sruthi-hassan-NTR-nivetha-pethuraj
- Advertisement -

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రెండో చిత్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

చదవండి: నేనెప్పుడూ అలాంటి కష్టాలు ఎదుర్కోలేదు.. తొలి సంపాదనతో ఏం చేశానంటే: అనసూయ

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి బయటికి వస్తోన్న ఆసక్తికర వార్తలు అటు అభిమానుల్లోనూ అంచనాలను పెంచేస్తున్నాయి.

తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి లభిస్తోన్న సమాచారం మేరకు ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా శృతి హాసన్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంలో నటించారు. 

అప్పట్లో మిస్, ఇప్పుడు మాత్రం…

నిజానికి ‘దమ్ము’ చిత్రంలోనే ఎన్టీఆర్‌కు జోడీగా శృతి నటించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల అప్పట్లో ఆ చిత్రం నుంచి శృతి హాసన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో ఎన్టీఆర్‌ సరసన త్రిష హీరోయిన్ అయింది. 

చదవండి: ప్రభుదేవా జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేసుకున్న నయనతార!

అయితే తాజా చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు పూజా హెగ్డే, కియారా అద్వానీ వంటి హీరోయిన్ల పేర్లు పరిశీలించినప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం శృతి హాసన‌వైపే మొగ్గుచూపిస్తున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు, ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్‌గా నటించేందుకు నివేతా పేతురాజ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

- Advertisement -