27.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఢిల్లీ జూలో ఆడపులి మృతి.. కరోనా మరణమేనా?

ఢిల్లీ జూలో ఆడపులి మృతి.. కరోనా మరణమేనా?

- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ జూలో బుధవారం ఓ ఆడపులి మరణించింది. 14 ఏళ్ల ఈ  ఆడపులి కల్పన మరణం ఇప్పుడు వివాదాస్పదమైంది.

కిడ్నీలు పాడవడం వల్లే ఇది మృత చెందిందని చెబుతున్న అధికారులు గురువారం దీని శాంపిళ్లను సేకరించిన కరోనా పరీక్షలకు పంపారు. 

మరోవైపు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ‘కల్పన’ మృతి చెందిందని మాజీ అధికారులు కొందరు ఆరోపిస్తున్నారు.

చనిపోయిన పులి కళేబరాన్ని గురువారం దహనం చేసినట్టు పర్యావరణ మంత్రి తెలిపారు. పులి బాగా బలహీనమైందని, దానిలో క్రియేటిన్ స్థాయులు పెరిగినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

కరోనా వైరస్ నేపథ్యంలో పులి కళేబరాన్ని అతికొద్ది మంది అధికారుల సమక్షంలో దహనం చేసినట్టు అధికారి ఒకరు తెలిపారు.

దాని శాంపిళ్లను బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు పంపినట్టు పేర్కొన్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపం ఫలితంగానే పులి మరణించిందని సెంట్రల్ జూ అథారిటీ మాజీ కార్యదర్శి డీఎన్ సింగ్ ఆరోపించారు.

అది డీహైడ్రేషన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. పులి కళేబరాన్ని దహనం చేస్తున్నప్పుడు ఒక్క సీనియర్ అధికారి కూడా లేరని, ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని సింగ్ పేర్కొన్నారు.

- Advertisement -