

నాగ చైతన్య , సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఒక విభిన్నమైన ప్రేమ కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. దివ్యాన్శక్ మరో కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు.
డిఫరెంట్ లుక్స్‌తో చైతూ….
క్రికెట్ లో చైతూ రాణిస్తుండటం, ఆయన దివ్యాన్శక్ ప్రేమలో పడటం , భార్య అయిన సమంతను దూరం పెట్టడం ఈ టీజర్లో చూపించారు. ‘ఒక్కసారి పోతే తిరిగిరాదురా .. అది వస్తువైనా .. మనిషైనా ..’ అనే రావు రమేశ్ డైలాగ్ .. ‘నువ్వు నా రూము లోపలికి రాగలవేమో గానీ, నా మనసులోకి ఎప్పటికీ రాలేవు’ అనే చైతూ డైలాగ్ .. ‘వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేశావ్’ అనే పోసాని డైలాగ్ మనసుకు పట్టుకునేలా వున్నాయి.
చైతూ క్లాస్ లుక్‌తోను, మాస్ లుక్‌తోను కనిపిస్తున్నాడు. ఆయన ప్రియురాలిగా దివ్యాన్శక్, భార్యగా సమంత కనిపిస్తున్నారు. లవ్, యాక్షన్, ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేదిలా ఉంది.
చదవండి: మహేష్‌పై వచ్చే రూమర్ నిజం కాదు? నమ్రత ఏం చెప్పిందంటే…








