
హైదరాబాద్: అక్కినేని వారసుడు నాగ చైతన్యకు, విక్టరీ వెంకటేష్ వరుసకు మేన మామ అవుతాడు. అలాగే దివంగత డాక్టర్ రామానాయుడు తాత. టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్‌దే.
ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వరుణ్ తేజ్ లాంటి నేటితరం స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన వెంకటేష్ ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు.
అంటే రియల్ మామతో రీల్ అల్లుడు పండించే కామెడీ ప్రేక్షకులు చుడనున్నారన్న మాట.రామానాయుడు స్టూడియోస్ బ్యానర్‌పై ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు రూపొందించిన రామానాయుడు గారికి తన కొడుకు, మనవడిని ఒకే తెరపై చూడాలనే బలమైన కోరిక ఉండేదట.
ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని ఈ విషయాన్ని బయటపెడుతూ తాత రామానాయుడు జయంతి సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశాడు అక్కినేని నాగచైతన్య,మీరు కోరుకునట్లుగా ప్రస్తుతం మీ కొడుకు, మనవడు ఒకే తెరపై కనిపించబోతున్నారు.
కానీ మీ కల నిజమయ్యే ఈ సమయానికి మీరు మా మధ్య లేకపోవడం బాధగా ఉంది అని రామానాయుడు తనయుడు దగ్గుబాటి సురేష్ బాబు పేర్కొన్న ఓ పోస్టర్ పోస్ట్ చేశాడు నాగచైతన్య. దీనిపై ‘వెంకీ మామ’ మీకే అంకితం అని ట్యాగ్ చేయడం విశేషం. అయితే దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీల మధ్య ఇంత అటాచ్‌మెంట్ చూసి ఖుషీ అవుతున్నాయి ఇరు ఫ్యామిలీల అభిమాన వర్గాలు.
This one is for you thatha #VenkyMama #HBDDRN pic.twitter.com/rIJKzqhisQ
— chaitanya akkineni (@chay_akkineni) June 6, 2019








