
హైదరాబాద్: మెగాపవర్ స్టార్ వినయ విధేయ రామ సినిమా భారీ ప్లాప్ తరువాత నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై హైప్ తారా స్థాయిలో ఉంది. వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపిస్తున్నారు. అలాగే మరోస్టార్ హీరో ఎన్టీఆర్ కొమరం భీం గా కనివిందుచేయనున్నాడు.
ఈ ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతకు ముందు శ్రీను వైట్లతో బ్రూస్ లీ సినిమా చేశాడు. ఇది యావరేజ్ గా నిలిచింది. సినిమా యావరేజ్ గా వచ్చినా, శ్రీను వైట్ల టేకింగ్ బాగుండటంతో సినిమా చేసేందుకు అంగీకరించాడట రామ్ చరణ్.
ఇక ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. బ్రూస్ లీ సినిమాలో కూడా ఆమె హీరోయిన్. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మరి ఈ ప్లాప్ కాంబినేషన్లో 2020 లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
రవితేజ తో వైట్ల అమర్ అక్బర్ ఆంటోని చేశాడు. అది కూడా ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం చరణ్ స్క్రిప్ట్ పై కాన్సన్ట్రేన్షన్ చేశారని, 2020 లో చరణ్ తో చేయబోయే సినిమాతో మళ్ళీ హిట్ కొడతారని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే రెండేళ్లు ఆగాల్సిందే.








