22.7 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ సాయితేజ్ ‘చిత్రలహరి’పై మెగాస్టార్ హాట్ కామెంట్స్!

సాయితేజ్ ‘చిత్రలహరి’పై మెగాస్టార్ హాట్ కామెంట్స్!

megastar hot comments on chitralahari
- Advertisement -

హైదరాబాద్: కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ .. కల్యాణి ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన ‘చిత్రలహరి’ ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు.

‘చిత్రలహరి’ సినిమా చూశాను చాలా బాగుంది. దర్శకుడు కిషోర్ తిరుమల ఆద్యంతం ఈ సినిమాను ఆసక్తికరంగా నడిపిస్తూ చక్కని ప్రతిభను కనబరిచారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇవ్వడంలో ఆయన సక్సెస్ అయ్యారు.

ఇక తేజు నటనలో మునుపటికన్నా మంచి పరిణతి కనిపించింది. మిగతా నటీనటులంతా కూడా చాలా చక్కగా పాత్ర పరిథిలో మెప్పించారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి, సునీల్ చాలా బాగా చేశారు. సంగీతం పరంగా చూసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ తన సత్తాను మరోమారు చాటుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఈ సినిమాతో వాళ్ల బ్యానర్ ప్రతిష్ఠ మరింత పెరిగింది..’ అని చెప్పుకొచ్చారు మెగాస్టార్.

- Advertisement -