28.5 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ హైదరాబాద్‌కి మహేశ్ బాబు మైనపు విగ్రహం! ఏఎంబీ సినిమాస్‌లో ప్రదర్శన!

హైదరాబాద్‌కి మహేశ్ బాబు మైనపు విగ్రహం! ఏఎంబీ సినిమాస్‌లో ప్రదర్శన!

maheshbabu mainapu styachu
- Advertisement -

maheshbabu mainapu styachu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు ఇటీవల కాలంలో వరుస విజయాలతో మంచి దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మహేష్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 25 న అభిమానుల ముందుకిరానుంది. మహేష్‌బాబుకి ఒక్క టాలీవుడ్ లోనే కాక , ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ మైనపు విగ్రహం..

దీనితోనే ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ విగ్రహానికి చోటు దక్కింది. ప్రస్తుతం సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్వరలోనే ఈ విగ్రహం హైదరాబాద్ కు రానుంది అని తెలుస్తోంది.

మహేశ్ బాబు భాగస్వామిగా ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైన ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్ లో ఈ మైనపు విగ్రహాన్ని అభిమానుల కోసం ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ నెల చివరిలో మహేశ్ మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చి, ఆ తర్వాత లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రధాన కార్యాలయానికి తరలిస్తామని మ్యూజియం వర్గాలు తెలిపాయి. విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి.

చదవండి: సూపర్ స్టార్ మహేష్‌బాబు పేరుకి.. కొత్త అర్థం చెప్పిన ‘అర్బన్ డిక్షనరీ’!

- Advertisement -