

ముంబై: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటివారిలో సోనాలిబింద్రే కూడా ఒకరు. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీ సోనాలి బింద్రే. ఖడ్గం, మన్మథుడు, శంకర్ దాదా MBBS వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీని తెలుగు సినీ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు.
అలాంటి బ్యూటీకి కూడా తీవ్ర అనారోగ్యం తప్పలేదు. కొంతకాలం క్రితం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. చికిత్స కోసం సోనాలి అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఎంతో ధైర్యంగా క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొన్న ఆమె దాన్నుంచి బయటపడి మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టింది. అంతేకాదు, ఎన్ని రోజులని ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటామంటూ మళ్ళీ సినిమాలు మొదలెట్టింది.
‘బుల్లితెర’లో షోలకు జడ్జ్‌గా..
సోనాలి బింద్రే షూటింగ్‌లో ఎప్పటిలానే పాల్గొంటూ, మరోవైపు వివిధ టెలివిజన్ షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరించనుంది. క్యాన్సర్ చికిత్స సమయంలో జట్టు లేకుండా కనిపించి సొనాలి తన ఫ్యాన్స్‌కు ఇచ్చిన షాక్ మరువలేనిది. ఇక ఇప్పుడు మళ్లీ తన అసలైన అందచందాలతో అమ్మడు అభిమానుల ముందుకు రానుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ.. తనకు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేసుకుంటోంది. అయితే చిక్కిత్సలో భాగంగా మళ్లీ ఒకసారి తాను న్యూయార్క్ వెళ్లాల్సి ఉంటుందని చెబుతోంది సొనాలి బింద్రే.








