కడపలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజ్! ఎన్టీఆర్ నైట్ అని నామకరణం!

3:48 pm, Sat, 16 March 19
Laxmis NTR Audio Release in Kadapa! NTR Night Name!, Newsxpressonline

హైదరాబాద్ : వివాదాలతో ప్రతి నిత్యం స్నేహం చేసే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నలక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఆడియో రిలీజ్ ను కడపలో విడుదల చేస్తామని ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

కడప జిల్లాలో గ్రాండ్ గా ప్లాన్…

కడపలో భారీ బహిరంగ సభలో ఈ వేడుకను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ‘‘వెన్నుపోటు అలియాస్ ఎన్టీఆర్ నైట్’’గా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. ఆడియో రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వర్మ అన్నారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో వర్మ స్పందిస్తూ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడప లో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది. ఈవెంట్ పేరు.. “వెన్ను పోటు” అలియాస్ ఎన్టీఆర్ నైట్. ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియజేస్తాం. జై ఎన్టీఆర్.. #LakshmiNTR’ అని ట్వీట్ చేశారు.