వివేకా అంతిమయాత్ర తరువాత జగన్ ఏం చేశాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Jagan after Viveka's funeral What tears do you know?, Newsxpressonline

కడప: బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా కలచివేసినట్లే ఉంది. నిన్నటివరకు పెద్ద దిక్కుగా ఉంటూ పార్టీ కి సంబందించిన అన్ని విషయాలని చూసుకున్న తన బాబాయ్ ఇలా హత్యకి గురౌవడంతో అయన తీవ్రమైన శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన శనివారం వైఎస్ వివేకానంద రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

ఆ తర్వాత హైదరాబాదుకు తిరుగుప్రయాణమయ్యారు. ఈ సమయంలో ఆయన కన్నీటిని ఆపుకోలేక ఏడుస్తూ కనిపించారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బాబాయ్ హత్య జరగడం ఆయనను తీవ్ర వేదనకు గురి చేసిందని సన్నిహితులు అంటున్నారు.

పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన శనివారం సాయంత్రం హైదరాబాదులోని లోటస్ పాండులో విడుదల చేయనున్నారు. 150 మంది పేర్లతో జగన్ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.