23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్ .. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్ .. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Lakshmi NTR First Day Collections News, Ram Gopal Varma Latest News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: రంగస్థల నటుడు విజయ్‌ కుమార్‌ ఎన్టీఆర్ గాను, యజ్ఞశెట్టి లక్ష్మి పార్వతిగాను నటించిన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే డైనమిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్టన్ లో తెరకెక్కింది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఊహించని పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

ఎన్టీఆర్ సాధారణ వ్యక్తి నుండి ఒక గొప్ప స్టార్ గాను , ఆ తరువాత ఒక గొప్ప నాయకుడిగాను మారడంలో అయన ఎన్నో వివాదాలని ఎదుర్కొన్నాడు. ఎక్కువగా అయన జీవితం చివరి రోజుల్లో అయన మరింత ఎక్కువగా క్షోభ పడ్డాడు. పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చి తన సత్తా ఏంటో యావత్ దేశానికీ చాటిన ఎన్టీఆర్ , ఆ తరువాత తన బయోపిక్ రాయడానికి వచ్చిన లక్ష్మి పార్వతిని కొన్ని కారణాలతో పెళ్లిచేసుకున్నాడు.

కానీ , ఆ సమయం లో ఎన్టీఆర్ చేసిన కొన్ని తప్పుల కారణంగా పార్టీని తన చేతుల్లోనుండి వెళ్లిపోయేలా చేసింది. వెన్నంటే ఉన్నవారు వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ ని మోసం చేసారు. ఈ వెన్నుపోటు అనే విషయాన్ని వర్మ తన కథగా మలుచుకొని అందరూ మెచ్చేలా తెరకెక్కించాడు వర్మ. ఈ షూటింగ్ లో ఉన్నప్పుడే ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చాయి. ఎన్టీఆర్ జీవితంలో వెన్నుపోటు పొడిచి , పార్టీ ని ఏ విధంగాలాకున్నది లక్ష్మీస్ ఎన్టీఆర్ లో డైరెక్టర్ ఆర్జీవీ కళ్ళకి కట్టినట్టు చూపించాడు. అలాగే అక్కడక్కడా నిజమైన ఎన్టీఆర్ క్లిప్స్ ని వాడి అందరిని ఆకట్టుకున్నాడు. అలాగే చివర్లో ఎన్టీఆర్ అంతిమయాత్ర నిజమైన విజువ‌ల్స్ చూపించి అందరికి మరో ఆ అన్నగారిని గుర్తుచేశాడు.

ఇక ఈ సినిమాపై మొదటి నుండి అంచనాలు భారీ స్థాయి లో ఉన్నాయి . దానికి తగ్గట్టే ట్రైలర్, టీజర్ లు అందరిని ఆకట్టుకోవడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దీనితో మొదటిరోజే సినిమా ఎలాగైనా చూడాలి అన్న కోరిక అందరిలోనూ కనిపించింది. ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతిచోటా కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా చూడటానికి ఓవర్సీస్ లో కూడా సినీ అభిమానులు మల్టీ ఫ్లెక్స్ ల ముందు క్యూలు కట్టారు అంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమా కోసం ఎంతగా వేచి చూస్తున్నారో.

ప్రీమియర్స్ నుండి సినిమాకి పూర్తి పాజిటివ్ టాక్ రావడంతో , శుక్రవారం తెల్లవారుజామునుండే థియేటర్స్ వద్ద అభిమానుల సందడి కనిపిస్తుంది. దీనితో ఈ చిత్రానికి తోలి రోజే భారీగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 13 కోట్లే, అయిన గాని తొలిరోజే అదిరిపోయే కలెక్షన్స్ తో ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురిచేసింది ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రానికి మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్లకి పైగా గ్రాస్ వసూలు అయింది. అలాగే 5 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ షేర్ కూడా రావడంతో చిత్ర యూనిట్ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. దానికి తోడు రివ్యూ లన్ని కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పూర్తిగా పాజిటివ్ గా రావడం కూడా సినిమా ఓపెనింగ్ కి బాగా కలిసొచ్చింది.

అంతేకాకుండా ఎన్నికలు మరో 13 రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కావడంతో రాజకీయ వర్గాలు కూడా ఈ సినిమాపై ఆసక్తిని కనపరుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1100 స్క్రీన్ లపై విడుదల చేసారు. దానితో ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే సమయానికి బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. మరో ముఖ్య విషయం ఏమిటి అంటే ఇంకా ఈ సినిమా ఏపీలో రిలీజ్ కాలేదు, ఒకవేళ ఏపీలో కనుక రిలీజ్ అయివుంటే బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేది అని అందరూ చర్చించుకుంటున్నారు.

- Advertisement -