బాలకృష్ణ వార్నింగ్‌పై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది!

hyperadi-and-balakrishna
- Advertisement -

hyperadi and balakrishna

హైదరాబాద్: హైపర్ ఆది… గత కొన్ని రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఒక ప్రముఖ ఛానల్ ప్రసారంచేసే జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన హైపర్ ఆది, ప్రస్తుతం బాగా బిజీ అయ్యాడు. ఒకవైపు జబర్దస్త్ లో చేస్తూనే మరోవైపు సినిమాలలో నటిస్తున్నాడు.

జబర్దస్త్ అభిమానుల్లో చాలామంది ఆది స్కిట్ కోసమే చూసేవారు అనేకమంది ఉన్నారు. అంతలా అందరిని తన కామెడీ టైమింగ్ తో నవ్విస్తాడు. అలాగే మరోవైపు తనకి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ కోసం జనసేన ప్రచార సభలలో కూడా ప్రసంగాలు చేస్తుంటాడు.

అలాంటి స్కిట్ ఏదీ నేను చేయలేదు…

ఈ నేపథ్యంలో తాజాగా ఒక వార్త ఫిలింనగర్ లో షికారు చేస్తోంది. ఒక స్కిట్ విషయంలో హైపర్ ఆదికి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారనేది ఆ వార్త సారాంశం. బాలకృష్ణ ఫోన్ చేసి మరీ ఆదికి క్లాస్ తీసుకున్నాడని చెప్తున్నారు.

ఈ విషయంపై తాజాగా హైపర్ ఆది క్లారిటీ ఇచ్చాడు. ” బాలకృష్ణ గారు నన్ను మందలించారనే వార్తలో ఎంతమాత్రం నిజంలేదు.. ఆయనకి అసహనాన్ని కలిగించే స్కిట్ ఏదీ నేను చేయలేదు..  అదిరే అభి టీమ్‌లో ఆ మధ్య ఒకరు ఎన్టీఆర్ గెటప్ వేశారు. ఆ విషయంలో ఎన్టీ రామారావుగారి అభిమానుల నుంచి ఎవరో ఫోన్ చేసి చిన్న వార్నింగ్ ఇచ్చారు. ఆ విషయాన్ని ఒక చోట నేను ప్రస్తావించడం వలన, అది నాకు ఆపాదించబడింది..అంతే” అని చెప్పుకొచ్చాడు.

చదవండి : ‘బిగ్‌బాస్’ సీజన్ 3 హోస్ట్‌గా ఎన్టీఆర్? కండీషన్స్ అప్లై! మరి రాజమౌళి ఒప్పుకుంటాడా?

- Advertisement -