ఆశ్చర్యం: రూ.50కే అన్‌లిమిటెడ్ బ్రేక్‌ఫాస్ట్, అదీ మెట్రో స్టేషన్‌లో.. ఎక్కడంటే…

7:00 pm, Fri, 8 February 19
lb nagar metro station

lb nagar metro station

హైదరాబాద్: రూ.50కే ఇష్టమొచ్చినన్ని ఇడ్లీలు, దోశలు, పొంగల్ తినొచ్చు.. అలాగే రూ.100కే కడుపారా భోజనం చేయొచ్చు.. అబ్బ.. ఏం ఛాన్స్.. ఇంతకీ ఎక్కడో.. అనుకుంటున్నారు కదూ? అయితే ఎల్‌బి నగర్ మెట్రో స్టేషన్ వద్దకు రండి. ఈ మెట్రో స్టేషన్‌లో గురువారం నుంచి ‘అయ్యంగార్ ఇడ్లీదోశ క్యాంటీన్’ అందుబాటులోకి వచ్చింది.

ఈ క్యాంటీన్‌ను మెట్రో రైల్ అధికారి అనిల్‌కుమార్ షైనీ తదితరులు ప్రారంభించారు. అనంతరం రుచికరమైన అల్పాహారాన్ని రుచి చూశారు. ఇలాంటివి నగరంలోని ఇతర మెట్రో స్టేషన్లలోనూ ప్రారంభిస్తే నగరవాసులకు ఇక పండగే మరి.. ఏమంటారు?