దొంగ ఫెలో.. చేసుకుంటానని చెప్పు: కూతురితో అల్లు అర్జున్ సరదా ముచ్చట!

10:09 am, Sat, 9 February 19
10
allu arjun daughters video

allu-arjun-special video

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. అల్లు అర్జున్ సినిమాలకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో, ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెంట్ ఇస్తాడు అని తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో ఏమాత్రం గ్యాప్ దొరికినా కూడా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేస్తూ ఉంటాడు.

అలాగే అల్లు అర్జున్ తనకు, తమ పిల్లలకు సంబంధించిన వీడియోలను తరచు పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా, తన ముద్దుల కూతురు అర్హతో తన సరదా సంభాషణను ఆయన పోస్ట్ చేశాడు. అర్జున్ చెబుతున్న మాటలను అర్హ తిరిగి చెబుతూ.. తండ్రిని ఆటపట్టించింది.

తండ్రిని ఆటపట్టిస్తున్న అర్హ…

‘నాన్నా.. నేను, నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను’ అని అర్జున్ చెప్పిన మాటలను అర్హ తిరిగి అనడం ఈ వీడియోలో కన్పిస్తుంది. ‘చేసుకుంటావా? చేసుకోవా?’ అని అర్జున్ అడగడం..‘చేసుకోను’ అని అర్హ చెప్పడంతో ‘దొంగ ఫెలో..చేసుకుంటానని చెప్పు’ అని అర్జున్ అంటూ కూతురిని ముద్దులతో ముంచెత్తడం ఈ వీడియోలో కనపడుతుంది. ఈ వీడియో చుసిన అయన అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు.

చదవండి: కిల్ బిల్ పాండే ఈజ్ బ్యాక్! బ్రహ్మానందాన్ని పరామర్శించిన అల్లు అర్జున్!